Indian Actors Famous in web series | థియేటర్, టీవీతో పాటు కరోనా అనంతరం ఓటీటీ కూడా ఇండియన్ సోసైటీలో భాగం అయిన విషయం తెలిసిందే. విదేశాల్లో ఓటీటీలు గత 10 ఏండ్ల నుంచే వాడకంలో ఉండగా.. భారత్‌లోకి కరోనాతో ఎంట్రీ ఇచ్చింది ఈ ఓటీటీ. ఇక ఓటీటీ రావడం.. అప్పటివరకు సినిమాలు మాత్రమే ఇష్టపడే ప్రేక్షకులు వెబ్ సిరీస్‌ల వైపు మళ్లడం ఇలా అన్ని ఫాస్ట్‌గా జరిగిపోయాయి. ఇక భారత్‌లో వెబ్ సిరీస్‌లకు మంచి మార్కెట్ ఉంది అని పసిగట్టిన మూవీ మేకర్స్ సినిమాలను వదిలేసి వెబ్ సిరీస్‌లను తెరకెక్కించడం మొదలుపెట్టారు. అయితే ఈ వెబ్ సిరీస్‌ల వలన కొందరూ నటులు సినిమాకు కూడా రాని పాపులారిటీని సంపాదించారు. ఇక ఆ నటులు ఎవరు అనేది చూసుకుంటే..
పంకజ్ త్రిపాఠి – మీర్జాపూర్
Pankaj Tripathi
బాలీవుడ్ నటుడు పంకజ్ త్రిపాఠి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. న్యూటన్, మాసాన్, ఫక్రే వంటి చిత్రాలతో మంచి గుర్తింపు సంపాదించాడు. అయితే అప్పటివరకు పంకజ్‌ని కేవలం నటుడిగా మాత్రమే గుర్తించేవారు. కానీ ఒక వెబ్ సిరీస్ వలన తన పాపులారిటీ అమాంతం పెరిగిపోయింది. ఇంతకీ ఆ వెబ్ సిరీస్ పేరు. మీర్జాపూర్. అమెజాన్ ప్రైమ్ ఒరిజినల్స్‌లో భాగంగా వచ్చిన ఈ వెబ్ సిరీస్ 2018లో విడుదలై సంచలన విజయం అందుకోవడమే కాకుండా రికార్డు వ్యూస్ సాధించింది. ఇక ఇందులో ఖాలీన్ భయ్యా అనే గ్యాంగ్‌స్టర్ పాత్రలో పంకజ్ నటన సిరీస్‌కే హైలెట్‌గా నిలిచిందని చెప్పవచ్చు.
దివ్యేండు శర్మ – మీర్జాపూర్
Divyendu Sharma
మీర్జాపూర్ వెబ్ సిరీస్ వలన పాపులర్ అయిన మరో బాలీవుడ్ నటుడు దివ్యేండు శర్మ. అప్పటివరకు బాలీవుడ్ సినిమాలలో చిన్న చిన్న పాత్రలు చేస్తూ వచ్చిన దివ్యేండు శర్మ మీర్జాపూర్లో తన విశ్వరూపం చూపించాడు. ఖాలీన్ భయ్యా(పంకజ్ త్రిపాఠి) కొడుకు మున్నా పాత్రలో అలరించాడు దివ్యేండు.
శోభితా ధూళిపాళ్ల – మేడ్ ఇన్ హెవెన్
Shobitha Dhulipala
అక్కినేని నాగచైతన్య భార్య, తెలుగు నటి శోభితా ధూళిపాళ్ల ఇప్పుడంటే సినిమాలలో కూడా నటిస్తుంది కానీ.. అసలు శోభితాకి ఫేం వచ్చిందే వెబ్ సిరీస్ వలన. ఆమె ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సిరీస్ మేడ్ ఇన్ హెవెన్. భారత్‌లోని సాంప్రదాయ పెళ్లిళ్ల ఆధారంగా వచ్చిన ఈ వెబ్ సిరీస్ ప్రైమ్‌లో విడుదలై సూపర్ హిట్ అందుకుంది.
మనోజ్ బాజ్‌పేయ్ – ది ఫ్యామిలీ మ్యాన్
Family Man
బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌పేయ్ గురించి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సత్య, శూల్, బండీట్ క్వీన్, కొమరం పులి, నామ్ శభానా, అలీఘర్, వీర్ జారా తదితర చిత్రాలలో నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే మనోజ్ మూవీ కెరీర్ అయిపోయింది అనే క్రమంలో వచ్చి అతడికి సెకండ్ ఇన్నింగ్స్‌గా నిలిచింది ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్. రాజ్ నిడిమోరు, కృష్ణ డీకే దర్శకత్వంలో వచ్చిన ఈ వెబ్ సిరీస్ సూపర్ హిట్ అందుకోవడమే కాకుండా మోస్ట్ పాపులర్ ఇండియన్ వెబ్ సిరీస్‌గా నిలిచింది.
జైదీప్ అహ్లవత్ – పాతాల్ లోక్
Paatal Lok
జైదీప్ అహ్లవత్ అనే పేరు చెబితే ఎవరు గుర్తుపట్టకపోవచ్చు కానీ.. ఇన్స్పెక్టర్ హాథీరామ్ చౌదరీ అంటే ఇట్టే గుర్తుపడతారు సినిమా ప్రేక్షకులు. అంతాల ఇంపాక్ట్ చేసింది ఈ క్యారెక్టర్. ఇక ఈ పాత్ర పాతాల్ లోక్ అనే వెబ్ సిరీస్‌లోనిది. అమెజాన్ నుంచి వచ్చిన మరో క్రేజీ వెబ్ సిరీస్ పాతాల్ లోక్(Paatal Lok). విరాట్ కోహ్లీ భార్య నటి అనుష్కా శర్మ నిర్మించిన ఈ వెబ్ సిరీస్ కరోనా లాక్డౌన్ టైంలో విడుదలై సూపర్ హిట్ అందుకోవడమే కాకుండా ప్రశంసలు అందుకుంది. ఇక ఈ వెబ్ సిరీస్‌లో ఇన్స్పెక్టర్ హాథీరామ్ చౌదరీ పాత్రలో నటించాడు బాలీవుడ్ నటుడు జైదీప్ అహ్లవత్ (Jaideep Ahlawat). ఒక మధ్య తరగతి తండ్రిగా.. పోలీస్ స్టేషన్లో ఎవరు గుర్తించని ఇన్స్పెక్టర్గా జీవించేశాడు జైదీప్ అహ్లవత్. ఫస్ట్ సీజన్ వచ్చిన అనంతరం దీనికి వచ్చిన ప్రశంసలలో సగం జైదీప్ అహ్లవత్కే దక్కింది. ప్రస్తుతం ఈ సిరీస్‌కి సీజన్ 2 కూడా వచ్చి స్ట్రీమింగ్ అవుతుంది.
ప్రతీక్ గాంధీ – స్కామ్ 1992
Scam 1992
వెబ్ సిరీస్ వలన పాపులర్ అయిన గుజరాతీ నటుడు ప్రతీక్ గాంధీ. ఆయన ప్రధాన పాత్రలో తెరకెక్కిన వెబ్ సిరీస్ స్కామ్ 1992. స్టాక్ బ్రోకర్ హర్షద్ మెహతా జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ ఓటీటీ వేదిక సోని లివ్‌లో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా ఇండియాలో ఆల్‌టైమ్ మోస్ట్ పాపులర్ షోగా నిలిచింది. 1992లో స్టాక్ మార్కెట్‌ను కుదిపేసిన హర్షద్ మెహతా స్కామ్‌ను చాలా ఆసక్తికరంగా తెరకెక్కించారు హన్సల్ మెహతా. అతని కథనం కట్టిపడేసింది. హర్షద్ పాత్రలో ప్రతీక్ గాంధీ జీవించేశాడు.
కేకే మీనన్ – స్పెషల్ ఓపీఎస్
Special Ops
బాలీవుడ్ నటుడు కేకే మీనన్ నటించిన యాక్షన్ వెబ్ సిరీస్ స్పెషల్ ఓపీఎస్. హిమ్మత్ సింగ్ అనే రా ఏజెంట్ తన దేశంపై జరుగబోతున్న ఉగ్రదాడులను ముందే తెలుసుకోని వాటిని ఆపడానికి ఒక స్పెషల్ టీమ్‌ని ఏర్పాటు చేస్తాడు. ఇక ఈ టీమ్ చేసే విన్యాసాలు ఏంటి అనేది వెబ్ సిరీస్ స్టోరీ.
జితేంద్ర కుమార్ – పంచాయత్
Panchayaat
యూట్యూబ్‌లో లఘు చిత్రాలు తీస్తూ ఫేమస్ అయ్యాడు నటుడు జితేంద్ర కుమార్. అయితే ఈ నటుడిని పంచాయత్ అనే వెబ్ సిరీస్ పూర్తిగా మర్చేసింది. ప్రైమ్ వేదికగా వచ్చిన ఈ సిరీస్ సూపర్ హిట్ అందుకుంది. ఈ వెబ్ సిరీస్ కథ విషయానికి వస్తే.. మధ్యప్రదేశ్ సెహోర్ జిల్లాలోని మారుమూల గ్రామమైన మహోడియాలో పంచాయితీ కార్యదర్శిగా వెళతాడు అభిషేక్ త్రిపాఠి(జితేంద్ర కుమార్). మహోడియాలో నిజాయతీగా పని చేయాలనుకున్న అభిషేక్‌కి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? వాటిని ఎలా అధిగమించాడు? అన్న ఆసక్తికర, కథ, కథనాలతో ఈ సిరీస్ సాగింది.
వీరే కాకుండా అలీ ఫజల్(మీర్జాపూర్), రసిక దుగ్గల్ (మీర్జాపూర్), ప్రియమణి(ది ఫ్యామిలీ మ్యాన్), శ్రియా పిల్గోంకర్(మీర్జాపూర్, గిల్టీ మైండ్స్, ది బ్రోకెన్ న్యూస్), శ్వేతా త్రిపాఠి శర్మ (మీర్జాపూర్) తదితరులు ఉన్నారు.