లోకనాయకుడు కమల్ హాసన్(kamal Hassan) కెరీర్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన చిత్రం ఇండియన్. ఈ సినిమాకి సీక్వెల్‌గా ఇండియన్ 2(Indian 2) తెరకెక్కిస్తున్నాడు శంకర్. చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్, శంకర్ మధ్య తలెత్తిన సమస్యల కారణంగా ఈ సినిమా చిత్రీకరణ ఆగిపోయింది. అయితే ఇప్పుడు శంకర్, చిత్ర నిర్మాణ సంస్థ మధ్య చర్చలు సఫలం కాడంతో మళ్లీఈ మూవీని సెట్స్ పైకి తీసుకెళ్లే ఆలోచన చేస్తున్నారట.
ఇప్పటికే సగం చిత్రీకరణ పూర్తి చేసుకోగా, వీలైనంత త్వరగా మిగతా భాగాన్ని పూర్తి చేయాలని చిత్రబృందం భావిస్తుందట. ఇప్పటికే శంకర్.. రామ్ చరణ్‌తో ఒక ప్రాజెక్ట్,రణ్వీర్ సింగ్‌తో ఓ ప్రాజెక్ట్ చేయనున్నట్టు కొద్ది రోజుల క్రితం ప్రకటించాడు. మరి ఈ సినిమాల తర్వాత వాటిని పూర్తి చేస్తాడా, లేకుంటే వీటిని చేసుకుంటూ ఆ మూవీని పూర్తి చేస్తాడా అన్నది చూడాలి. ఇండియన్ 2లో కమల్ హాసన్ సరసన కాజల్ అగర్వాల్(kajal aggarwal) కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే.