Indian-2 Movie | తమిళ ఇండస్ట్రీ నుంచి వస్తున్న భారీ బడ్జెట్ సినిమాల్లో ఇండియన్-2 ఒకటి. ఇరవై ఏడేళ్ల క్రితం వచ్చిన ఈ సినిమా తొలి భాగం బాక్సాఫీస్ దగ్గర సృష్టించిన రికార్డులు అంతా ఇంతా కాదు. అప్పట్లోనే ఈ సినిమా రూ.50 కోట్ల గ్రాస్‌ను కలెక్ట్ చేసి నిర్మాతల పాలిట కామధేనువులా కాసుల వర్షం కురిపించింది. అవినీతిని రూపు మాపడానికి ఓ మాజీ స్వతంత్ర సమరయోధుడు ఎలా నడుం బిగించాడు అనే నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. శంకర్ డైరెక్షన్, కమల్ నటన అప్పట్లో ఓ సంచలనం. కాగా ఇన్నేళ్ల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతుంది. అయితే ఏవో కారణాలతో సినిమా వాయిదా పడుతూ వచ్చింది. అటు శంకర్ కూడా రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ తో బిజీ అయ్యారు. రెండు సినిమాలకి సమాంతరంగా కొన్నాళ్ళు పని చేశారు.
అయితే కొన్నాళ్ళుగా ఎలాంటి అప్డేట్ లేకుండా వున్న ‘ఇండియన్ 2′ ప్రాజెక్ట్ ఇప్పుడు మరో అడుగుముందుకు వేసింది. తాజాగా ఈ సినిమా డబ్బింగ్ పనులు షురూ చేశారు. ఈ విషయాన్ని తెలుపుతూ నిర్మాణ సంస్థ గ్లింప్స్‌ను విడుదల చేసింది. అందులో శంకర్, కమల్ హాసన్ ఇద్దరూ డబ్బింగ్ స్టూడియోలో కనిపించారు. విక్రమ్ తో పాన్ ఇండియా విజయాన్ని అందుకుకొని మంచి ఫామ్ లో కమల్ హాసన్…ఇప్పుడు సూపర్ హిట్ ‘భారతీయుడు’ సీక్వెల్ తో రావడంతో ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి.
కాజల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో సిద్ధార్థ్ కీలకపాత్రలో నటిస్తున్నాడు. స్వర మాంత్రికుడు రెహమాన్ స్వరాలు సమకూర్చుతున్నాడు. ఈ సినిమాను రెడ్ జియాంట్, లైకా ప్రొడక్షన్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఆ మధ్య ఇండిపెండెన్స్ డేకు రిలీజైన కమల్ లుక్కు విశేష స్పందన వచ్చింది.
A glimpse of dubbing 🎙️ session from INDIAN-2 🇮🇳 ft. Ulaganayagan @ikamalhaasan 🤗 & Director @shankarshanmugh 🎬
Dubbing in Progress ███░░#Indian2 🇮🇳 @anirudhofficial @dop_ravivarman @LycaProductions #Subaskaran @RedGiantMovies_ @gkmtamilkumaran @MShenbagamoort3 pic.twitter.com/kGlMKbWcC1
— Lyca Productions (@LycaProductions) October 9, 2023