Independence Day | దేశవ్యాప్తంగా 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశ ప్రజలతో పాటు రాజకీయ నాయకులు సినీ, క్రీడా ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక టాలీవుడ్ నుంచి కూడా అగ్ర కథానాయకులు మెగాస్టార్ చిరంజీవితో పాటు జూనియర్ ఎన్టీఆర్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కల్కీ టీం, అలాగే మలయాళ నటుడు మమ్ముట్టి తదితరులు ఎక్స్ వేదికగా విషెస్ తెలుపుతున్నారు.
మెగాస్టార్ చిరంజీవి ఎక్స్ వేదికగా రాసుకోస్తూ.. దేశ ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు. దీని కోసం మన పూర్వీకులు ఎంతోమంది ఎన్నో పోరాటాలు, త్యాగాలు చేశారు. వాళ్లందరినీ స్మరించుకుందాం. వారిని ఆదర్శంగా తీసుకుందాం. జైహింద్- చిరంజీవి అంటూ ప్రకటించాడు.
Happy Independence Day to All! 🙏
May all of us remember the struggles and sacrifices of our forefathers to gift us this freedom!
May their ideals always guide us on the path of righteousness, compassion and excellence! Jai Hind 🇮🇳 pic.twitter.com/2c73YYcsQw
— Chiranjeevi Konidela (@KChiruTweets) August 15, 2024
అల్లు అర్జున్ శుభాకాంక్షలు తెలుపుతూ.. ఈ ప్రపంచంలో ఉన్న భారతీయులందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు అంటూ రాసుకోచ్చాడు.
Happy Independence Day to each and every Indian in the world . Jai Hind 🇮🇳 pic.twitter.com/OWiNGqyjtx
— Allu Arjun (@alluarjun) August 15, 2024
అందరికీ 78వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు అంటూ జూనియర్ ఎన్టీఆర్‌తో పాటు మలయాళ నటుడు మమ్ముట్టి రాసుకోచ్చారు.
78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. Wishing everyone a Happy Independence Day. Jai Hind.🇮🇳
— Jr NTR (@tarak9999) August 15, 2024
Happy Independence Day ! pic.twitter.com/SaCyiLHctH
— Mammootty (@mammukka) August 15, 2024
ప్రభాస్ నటించిన కల్కి చిత్రం నేటికి 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆడియెన్స్‌కు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ మేకర్స్ ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. సినిమాను బ్లాక్‌బస్టర్ చేసినందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ చిత్రం ఇప్పటివరకు రూ.1200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.
A moment of glory ❤️🇮🇳
Proudly celebrating 50 DAYS of #Kalki2898AD. A big thank you to our incredible audience for making our film flourish across the world.#50DaysForKalki2898AD ❤️🔥@SrBachchan @ikamalhaasan #Prabhas @deepikapadukone @nagashwin7 @DishPatani @Music_Santhosh… pic.twitter.com/Ybwr0XQR3s
— Kalki 2898 AD (@Kalki2898AD) August 15, 2024