Imran Hashmi | ప్రముఖ బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీకి ప్రమాదం జరిగింది. అడివిశేష్ నటిస్తున్న తాజా చిత్రం జీ2లో నటిస్తున్న ఇమ్రాన్ హష్మీ ఈ షూటింగ్లో భాగంగా ప్రమాదానికి గురయ్యాడు.
టాలీవుడ్ నటుడు అడివిశేష్ నటిస్తున్న తాజా ప్రాజెక్ట్ ‘జీ 2’(G2). శేష్ కెరీర్లో గుర్తుండిపోయే చిత్రాలలో ‘గూఢచారి’ (Gudachari2) ఒకటి. 2018లో స్పై థ్రిల్లర్‌గా వచ్చిన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ అందుకుంది. ఇప్పుడు ఇదే సినిమాకు ‘జీ 2’(G2) అంటూ సీక్వెల్ రాబోతుంది. ఈ సినిమాకు వినయ్ కుమార్ దర్శకత్వం వహిస్తుండగా.. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే ఈ సినిమాలో విలన్‌గా బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ షూటింగ్లో భాగంగా ఇమ్రాన్ హష్మీ ప్రమాదానికి గురయ్యాడు.
ఒక యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ప్రమాదవశాత్తూ ఇమ్రాన్‌కు కుడి దవడ కింది భాగంలో గాయమైంది. దీంతో పెద్ద గాటు పడింది. ఈ విషయాన్ని ఇమ్రాన్ వ్యక్తిగత సిబ్బంది వెల్లడించారు. అయితే ఈ విషయం తెలుసుకున్న ఇమ్రాన్ హష్మీ అందోళన చెందుతున్నారు. త్వరగా కోలుకోవాలి అంటూ కామెంట్లు పెడుతున్నారు.