Gaami | అసాధ్యమైన కల సాకారం.. విశ్వక్ సేన్ గామిపై ఎస్ఎస్ రాజమౌళి
Gaami | టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ (Vishwak Sen) కాంపౌండ్ నుంచి వస్తున్న తాజా చిత్రం గామి (Gaami). ఇటీవలే మేకర్స్ గామి ట్రైలర్‌ను లాంఛ్ చేయగా.. నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా ఈ సినిమాపై స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రశంసలు కురిపిస్తూ.. ఓ మెసేజ్‌ను అందరితో పంచుకున్నాడు.
Gaami | టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ (Vishwak Sen) కాంపౌండ్ నుంచి వస్తున్న తాజా చిత్రం గామి (Gaami). అడ్వెంచరస్ ఫాంటసీ ఫిల్మ్‌గా వస్తోన్న ఈ చిత్రానికి విద్యాధర్ దర్శకత్వం వహిస్తున్నాడు. విశ్వక్ సేన్ అఘోరాగా కనిపించనుండగా.. చాందినీ చౌదరి ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఇటీవలే మేకర్స్ గామి ట్రైలర్‌ను లాంఛ్ చేయగా.. నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా ఈ సినిమాపై స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రశంసలు కురిపిస్తూ.. ఓ మెసేజ్‌ను అందరితో పంచుకున్నాడు.
అసాధ్యమైన కలలు…కానీ వాటిని సాకారం చేయడం కోసం వారి చెమటోడ్చి పని చేశారని.. నిర్మాత కార్తీక్, దర్శకుడు విద్యాధర్ నన్ను కలుసుకుని, ఇంప్రెసివ్ విజువల్స్ సాధించడంలో వారి 4 సంవత్సరాల ప్రయత్నాల గురించి మాట్లాడినప్పుడు నాకు అనిపించింది. మార్చి 8న విడుదల కానున్న గామి టీమ్ మొత్తానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చాడు.
నేనెవరో.. అసలు ఎక్కడినుంచి వచ్చానో.. నాకీ సమస్య ఎప్పటి నుంచి ఉందో.. ఎంత ప్రయత్నించినా గుర్తు రావట్లేదు.. అంటూ విశ్వక్సేన్ వాయిస్ ఓవర్‌తో సాగుతున్ సంభాషణలు సస్పెన్స్‌గా సాగుతూ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి. ఇదివరకెన్నడూ టచ్ చేయని కథాంశాన్ని సిల్వర్ స్క్రీన్‌పై సరికొత్తగా చూపించబోతున్నాడా..? అంటూ తెగ చర్చించుకుంటున్నారు ట్రైలర్ చూసిన సినీ జనాలు.
ఇటీవలే గామి మేకింగ్ వీడియోను విడుదల చేయగా.. ఒక మనిషి తన భయాన్ని జయించటానికి చేసే అసాధ్యమైన, తెలియని ప్రయాణం అంటూ విశ్వక్సేన్, చాందినీ చౌదరి మంచు కొండల్లో అన్వేషణలో ఉన్న లుక్‌తోపాటు మేకింగ్ విజువల్స్ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి.గామి వరల్డ్ వైడ్‌గా మార్చి 8న విడుదల కానుంది. ఈ చిత్రంలో ఎంజీ అభినయ, మహ్మద్ సమద్, దయానంద్ రెడ్డి, హారికా ఇతర కీలక పాత్రలు పోషిస్తుండగా… వీ సెల్యూలాయిడ్ సమర్పణలో కార్తీక్ శబరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
గామి ట్రైలర్..
గామి మేకింగ్ వీడియో..
A man’s journey through the impossible and the unknown to conquer his fear 🧿#Gaami GRAND RELEASE WORLDWIDE ON MARCH 8th ❤️🔥
Watch the making video now!
– https://t.co/5NMBYrPTa7Get ready for a NEW EXPERIENCE only on the BIG SCREENS ✨@VishwakSenActor @iChandiniC… pic.twitter.com/eVavPeNGBH
— BA Raju’s Team (@baraju_SuperHit) February 7, 2024

Gaami2
చాందినీ చౌదరి గామి అప్డేట్..
Gaami is finally a wrap! Can’t wait for the world to witness this fantastic film we made 🔥 pic.twitter.com/a9v7E6SytL
— Chandini Chowdary (@iChandiniC) May 1, 2023
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి గ్లింప్స్..
విశ్వక్సేన్, నేహాశెట్టి డ్యాన్స్..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

