దక్షిణాదిలో ఒకప్పుడు అగ్ర తారగా పేరు తెచ్చుకున్న ఇలియానా ప్రస్తుతం బాలీవుడ్లో సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తోంది. తాజాగా ఈ భామ డిజిటల్ మీడియా వైపు దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. అగ్ర కథానాయికలు సైతం వెబ్‌సిరీస్‌లు, టాక్‌షోలతో రాణిస్తుండటంతో ఇలియానా సైతం ఆ ప్రయత్నాల్లో ఉందని తెలిసింది. ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ కోసం ఇలియానా ఓ టాక్‌షో చేయబోతున్నదని ముంబయి సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ టాక్‌షో కాన్సెప్ట్ నచ్చడంతో ఇలియానా వెంటనే అంగీకరించిందని..దీనికోసం ఆమె భారీ పారితోషికం అందుకుందని చెబుతున్నారు. ఇప్పటివరకు వెండితెరపై అలరించిన ఇలియానా టాక్‌షో ప్రయోక్తగా కొత్త అవతారమెత్తడం అభిమానుల్లో ఆసక్తికరంగా మారింది. ఈ టాక్‌షోకు సంబంధించిన పనులన్నీ పూర్తయ్యాయని, ఈ ఏడాది ద్వితీయార్థంలో ప్రసారానికి సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది.