ఒకానొక టైంలో స్టార్ హీరోల సినిమాలతో బిజీగా ఉంది గోవా బ్యూటీ ఇలియానా (Ileana). అయితే రవితేజతో చివరి సారిగా అమర్ అక్బర్ ఆంటోనీలో మెరిసిన ఇలియానా..మరే తెలుగు సినిమాలో కనిపించలేదు. ఈ బ్యూటీ పలు బాలీవుడ్ సినిమాలు చేసినా అక్కడ కూడా స్పీడు తగ్గించింది. ప్రస్తుతం ఈ భామ ఖాతాలో ఒకే ఒక్క హిందీ సినిమా ఉండగా..ఇటీవలే షూటింగ్ పూర్తి చేసింది . ప్రతీక్ గాంధీ (Ileana)మేల్ లీడ్ రోల్లో నటిస్తోన్న ఈ ప్రాజెక్టులో విద్యాబాలన్ (Vidya Balan) కీలక పాత్ర పోషిస్తోంది.
యాడ్ ఫిల్మ్ మేకర్ షిర్షా గుహ (Shirsha Guha )దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రధాన భాగం ఊటీ (Ooty), ముంబైలో చిత్రీకరించారు. చాలా కాలం తర్వాత ఇలియానా నటనకు ఆస్కారమున్న పాత్రలో కనిపించనున్నట్టు బీటౌన్ సర్కిల్ టాక్. ఈ ఏడాది కూకి గులాటి డైరెక్షన్లో తెరకెక్కిన ది బిగ్ బుల్ చిత్రంతో ప్రేక్షకులను పలుకరించింది ఇలియానా. ఈ చిత్రంలో అభిషేక్ బచ్చన్ హీరోగా నటించాడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Pushpa Five Shows | అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘పుష్ప’ ఐదో షోకు అనుమతి
Rakul Preet Singh Christmas | రకుల్ ఈ సారి ఎవరితో క్రిస్మస్ చేసుకోబోతుందంటే..?
Pushpa Five Shows | అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘పుష్ప’ ఐదో షోకు అనుమతి
Varalaxmi Joins Yashoda | క్రేజీ అప్డేట్..’యశోద’తో జాయిన్ అయిన ‘జయమ్మ’