Ananya Pandey | ఒకప్పుడు ఐటెంమ్ సాంగ్స్ అంటే.. వాటికోసం ప్రత్యేకంగా నర్తకీమణులుండేవారు. జయమాలిని, సిల్క్‌స్మిత, అనూరాథ.. ఇలా అనమాట. ఇప్పుడు ఆ బాధ్యతను కూడా స్టార్ హీరోయిన్లే మోసేస్తున్నారు. ఒక సినిమాలో హీరోయిన్గా చేస్తే ఎంత పారితోషికం ముడుతుందో.. ఒక్క పాటకు అంత పారితోషికం ఇస్తామంటే ఎవరు కాదంటారు చెప్పండి? ఐశ్వర్యరాయ్ దగ్గర్నుంచి శ్రియ, సమంత, కాజల్, తమన్నా రీసెంట్గా త్రిష.. ఇలా చాలామంది స్టార్ హీరోయిన్లు ఐటమ్ సాంగ్స్‌లో మెరిసన వారే.
ఇప్పుడు ఈ లిస్ట్‌లో చేరడానికి బాలీవుడ్ భామ అనన్య పాండే కూడా సుముఖత వ్యక్తం చేస్తున్నది. ఇటీవల ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ‘ఐటమ్ సాంగ్స్‌లో చేయడానికి నాకెలాంటి అభ్యంతరం లేదు. కాకపోతే కథకు సంబంధం లేకుండా, కథ డిమాండ్ చేయకపోయినా కొందరు అనవసరంగా ఐటమ్ సాంగ్స్ పెడుతుంటారు. అలాంటి పాటల్లో నర్తించను, నటించను. నేను ఐటమ్ సాంగ్ చేస్తే అది కథలో ఉండాలి. కథ ఆ పాటను డిమాండ్ చేయాలి. అలాంటి పాట వస్తే తప్పకుండా ఐటమ్ సాంగ్ చేసా.్త’ అని తెలిపింది అనన్య పాండే.