సంతోశ్ శోభన్.. హిట్ కొడితే కుర్రాడికి మంచి రోజులు వచ్చినట్లే..

santosh shobhan manchi rojulachaie | సంతోశ్ శోభన్.. ఈ మధ్య కాలంలో తెలుగు ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. వరుస సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు ఈ కుర్ర హీరో. ఈయనకు ప్రభాస్ లాంటి టాప్ హీరో అండ దొరికింది. దాంతో సంతోశ్ కెరీర్ సెట్ అయిపోయింది. ఈ హీరోకు ప్రభాస్ అండగా నిలబడటమే కాకుండా ఆయన కెరీర్‌కు కావాల్సిన బూస్టప్ ఇస్తున్నాడు. వర్షం సినిమా దర్శకుడు శోభన్ తనయుడు సంతోశ్. తన కెరీర్ మొదట్లో అంత మంచి విజయం ఇచ్చాడని కృతజ్ఞతతో ఆయన కొడుకు బాధ్యత తీసుకుని వరుస అవకాశాలు ఇప్పిస్తున్నాడు. ఈ క్రమంలోనే యూవీ క్రియేషన్స్ సహ నిర్మాణ సంస్థ uv కాన్సెప్ట్స్ నిర్మించిన ఏక్ మినీ కథ సినిమాతో మంచి విజయం అందుకున్నాడు సంతోశ్ శోభన్. ఇప్పుడు మంచి రోజులు వచ్చాయి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
మేర్లపాక గాంధీ కథ అందించిన ఏక్ మినీ కథ సినిమాను కార్తీక్ రాపోలు అనే కొత్త దర్శకుడు తెరకెక్కించాడు. ఇప్పటి వరకు తెలుగు సినిమాలో ఎవరూ టచ్ చేయని ఒక బోల్డ్ పాయింట్ ను ఈ సినిమాలో డిస్కస్ చేశారు దర్శక నిర్మాతలు. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో నటించిన మంచి రోజులు వచ్చాయి దీపావళికి విడుదల అవుతుంది. ఓవైపు గోపీచంద్‌తో పక్కా కమర్షియల్ సినిమా చేస్తూనే.. మరోవైపు కేవలం 40 రోజుల్లో మంచి రోజులు వచ్చాయి సినిమా పూర్తి చేశాడు మారుతి. దీపావళి కానుకగా నవంబర్ 4న మంచి రోజులు వచ్చాయి సినిమా విడుదల అవుతుంది. మారుతి సినిమా అంటే మినిమమ్ గ్యారెంటీ.. దాంతో సంతోశ్ కెరీర్ సెట్ అయిపోయినట్లే కనిపిస్తుంది. ఈ సినిమా విజయం సాధిస్తే సంతోశ్ మార్కెట్ కూడా పెరుగుతుంది. వీటితో పాటు ప్రేమ్ కుమార్ అని సినిమా కూడా చేస్తున్నాడు సంతోశ్ శోభన్. పెళ్లి నేపథ్యంలో తెరకెక్కిన కామెడీ ఎంటర్టైనర్ ఇది. దానికితోడు గీతా ఆర్ట్స్ లో అల్లు అరవింద్ నిర్మాతగా ఒక సినిమా చేయబోతున్నాడు సంతోశ్. ఇదే ఊపులో మరో రెండు మూడు సినిమాలు పడితే ఈ కుర్ర హీరో సెటిల్ అయిపోతాడు. ఏదేమైనా కూడా సంతోశ్ శోభన్ ను హీరోగా నిలబెట్టాలని ప్రభాస్ చేసిన ప్రయత్నం అయితే సక్సెస్ అయింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Manchi Rojulochaie | మంచి రోజులు వచ్చాయి సినిమాకు స్పెషల్ ప్రీమియర్స్..
santosh shobhan | సంతోష్ శోభన్ కెరీర్‌కు నిజంగానే మంచి రోజులు వచ్చాయి..!
santosh shobhan | లక్కీ ఛాన్స్..ఆ బ్యానర్ లోనే మళ్లీ 3 సినిమాలు..!
Mehreen firzada | పెళ్లి క్యాన్సిల్..బీచ్‌లో మెహరీన్ ఎంజాయ్
Mehreen firzada | మెహ్రీన్ కౌర్ కంటే ముందు పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న సినీ ప్రముఖులు వీళ్లే
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

