Identity On OTT | మలయాళ నటుడు టోవినో థామస్(Tovino Thomas), త్రిష(Trisha Krishnan), వినయ్ రాయ్(Vinay roy) ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘ఐడెంటిటీ’ (Identity). ఈ సినిమాకు అఖిల్ పాల్, అనాస్ఖాన్ సంయుక్తంగా దర్శకత్వం వహించారు. ఇన్వెస్టిగేట్ థ్రిల్లర్గా వచ్చిన ఈ చిత్రం జనవరి 02న ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అందుకుంది. అయితే ఈ సినిమాను తెలుగులో నేడు విడుదల చేశారు మేకర్స్. ఇదిలావుంటే.. ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు రాగా.. మరోవైపు ఈ సినిమా ఓటీటీ అప్డేట్ ఇచ్చారు నిర్వహాకులు.
ఈ సినిమా ప్రముఖ ఓటీటీ వేదిక జీ5లో జనవరి 31 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. ఈ సందర్భంగా కొత్త పోస్టర్ను విడుదల చేసింది. మలయాళంతో పాటు, తమిళ, తెలుగు, కన్నడ భాషల్లో ఈ మూవీ అందుబాటులోకి రానుంది.
Unravel the mystery! #Identity streams on ZEE5 from 31st January. Don’t miss the twists and suspense!
PREMIERES 31st JANUARY Malayalam | Tamil | Kannada | Telugu@akhilpaul_ @anaskhan_offcl @tovinothomas @trishakrishnan @vinayrai79 @akhilpaul_ @anaskhan_offcl #RajuMalliath… pic.twitter.com/ictWH10zhf
— ZEE5 Keralam (@zee5keralam) January 24, 2025