Allu Arjun | అవార్డు రాకతో అల్లు వారింట ప్రైవేట్ పార్టీ.. ఫోటోలు వైరల్..!
Allu Arjun Private Party | జాతీయ ఉత్తమ నటుడు అవార్డు రావడంతో అల్లు వారింట సంబురాలు మొదలయ్యాయి. దశాబ్దాల చరిత్ర కలిగిన తెలుగు సినిమాలో తొలి నేషనల్ అవార్డు అందుకున్న హీరో బన్నీ కావడంతో అభిమానులు సంబురాలు చేసుకుంటున్నారు.
Allu Arjun Private Party | జాతీయ ఉత్తమ నటుడు అవార్డు రావడంతో అల్లు వారింట సంబురాలు మొదలయ్యాయి. దశాబ్దాల చరిత్ర కలిగిన తెలుగు సినిమాలో తొలి నేషనల్ అవార్డు అందుకున్న హీరో బన్నీ కావడంతో అభిమానులు సంబురాలు చేసుకుంటున్నారు. పుష్ప రాజ్‌గా ఏడాదినర్ధం కిందట ఇండియా బాక్సాఫీస్‌ను ఊపేసి.. ఇప్పుడు ఇండియా మొత్తం తనవైపు చూసేలా చేసుకున్నాడు. ఈయన హీరో ఏంట్రా అనే స్థాయి నుంచి హీరో అంటే బన్నీ రా అనే స్థాయికి రావడం, ఇప్పుడు ఏకంగా నేషనల్ అవార్డు గెలుచుకోవడం ఆయన పట్టుదల, శ్రమకు నిదర్శనం. ఇక సోషల్ మీడియాలో బన్నీపై ప్రశంసల ప్రవాహం కొనసాగుతుంది. సినీ ప్రముఖులు సహా రాజకీయ నాయకులు బన్నీపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.
ఇక ఇదిలా ఉంటే తాజాగా బన్నీ తన ఇంట్లో ప్రైవేట్ పార్టీని ఏర్పాటు చేశాడు. కుటుంబ సభ్యులతో పాటు అత్యంత సన్నిహితులు ఈ పార్టీకి హాజరయ్యారు. బన్నీకు జాతీయ అవార్డు తెచ్చిపెట్టిన పుష్ప థీమ్‌తో ఈ పార్టీ జరిగింది. గంధపు చెక్కల లారీ, పుష్పలో బన్నీ వాడిన గొడ్డలి, తగ్గేదేలే అంటూ పుష్ప థీమ్‌ను పార్టీలో ప్రదర్శించారు. ప్రస్తుతం ఈ పార్టీకి సంబంధించిన కొన్ని ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. సుకుమార్ దర్శకత్వం వహించిన పుష్ప సినిమా బాక్సాఫీస్ నెలకొల్పిన రికార్డులు అన్నీ ఇన్నీ కాదు. అసలెలాంటి ప్రమోషన్లు చేయకుండా హిందీలో వంద కోట్లు కొల్లగొట్టి బన్నీకు నార్త్‌లో తిరుగులేని క్రేజ్‌ను సంపాదించిపెట్టింది.
ఇంకా రిలీజ్ డేటు కూడా ఖరారు కానీ పుష్ప-2 పై ప్రేక్షకుల్లో మాములు అంచనాల్లేవు. ఎప్పుడొచ్చిన బంపర్ హిట్టవడం ఖాయం అని అప్పుడే బాక్సాఫీస్ లెక్కలు కూడా వేసేస్తున్నారు. బన్నీ ఈ సారి వెయ్యి కోట్లు కొల్లగొట్టడం పక్కా అని ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు. దానికి తగ్గట్టే సుక్కు సైతం సినిమాను వేరే లెవల్‌కు తీసుకెళ్లేలా ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్ వీడియో టాలీవుడ్‌తో సహా అన్ని వుడ్‌లలోనూ సంచలనాలు సృష్టించింది. జస్ట్ గ్లింప్సే ఆ రేంజ్లో ఉంటే సినిమా ఇంకా ఏ లెవల్లో ఉండబోతుందో అని తెగ ఆసక్తితో ఉన్నారు.

Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

