Rasika Dugal | బాలీవుడ్ నటి రసిక దుగల్ మరోసారి తన సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచింది. పితృస్వామ్యాన్ని (Misogyny) ప్రోత్సహించే సినిమాలను తాను ఎప్పటికీ అంగీకరించబోనని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా బాలీవుడ్లో భారీ విజయం సాధించిన ‘యానిమల్’ (Animal) వంటి సినిమా ఆఫర్ తనకు వస్తే తాను ‘నో’ చెప్పేదానినని తెలిపింది. ‘మీర్జాపూర్’, ‘ఢిల్లీ క్రైమ్’ వంటి పాపులర్ వెబ్ సిరీస్‌లతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రసిక దుగల్.. సినిమాలను ఎంచుకునే విషయంలో తన విధానాన్ని తాజాగా ఒక ఇంటర్వ్యూలో పంచుకుంది.
నేను ఎంచుకునే ప్రతి సినిమా యొక్క రాజకీయాలు నాకు చాలా ముఖ్యం. కేవలం పైపైన చూడడం కాకుండా, అది నా నిర్ణయాలకు మూలస్తంభంగా నిలుస్తుంది. ఒకవేళ నాకు ‘యానిమల్’ వంటి సినిమాలో అవకాశం వచ్చి ఉంటే దానికి నేను ఖచ్చితంగా ‘నో’ చెప్పేదాన్ని. ఎందుకంటే పితృస్వామ్యాన్ని ప్రోత్సహించే ప్రాజెక్ట్‌ను నేను ఒకరోజు అంగీకరిస్తానేమోననేదే నా అతిపెద్ద భయం అని రసిక దుగల్ అన్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
Rasika Dugal, outspoken as ever, says she would have said no to a movie like Animal because her biggest fear is that one day she will accept a project that will inadvertently promote misogyny. With Mirzapur and Delhi Crime, this has been Rasika’s moment in many ways. It was… pic.twitter.com/7uk6LnpnZ3
— barkha dutt (@BDUTT) December 2, 2025