టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) మహానటి డైరెక్టర్ నాగ్ అశ్విన్ (Nag Ashwin) డైరెక్షన్ లో ప్రాజెక్టు కే (ProjectK) చేస్తున్న విషయం తెలిసిందే. సైన్స్ ఫిక్షన్ జోనర్ లో తెరకెక్కుతుందీ చిత్రం. ఈ క్రేజీ ప్రాజెక్టులో అందాల తార సమంత అక్కినేని (Samantha) నటించబోతుందని రూమర్స్ తెరపైకి వచ్చాయి. వీటిపై ఫైనల్ గా సమంత నుంచి క్లారిటీ వచ్చింది. ప్రాజెక్టు కే విషయంలో ఏం జరుగుతుందో చెప్పుకొచ్చింది సామ్.
‘ఈ పుకారు ఎలా బయటకు వచ్చిందో నాకు తెలియదు. కానీ నాగ్ అశ్విన్ ప్రాజెక్టులో భాగం అయితే చాలా సంతోషంగా ఫీలవుతా. నేను ఎందుకు ఈ సినిమాలో ఎంపిక కాలేదో నాగ్ అశ్విన్ అడుగుతా. ఇదే విషయంపై నాగ్ అశ్విన్ కు వెంటనే మెసేజ్ చేస్తానంటూ చెప్పుకొచ్చింది. ఈ మధ్య నేను కొత్త సినిమాలకు సంతకం చేయలేదు. గుణశేఖర్ డైరెక్షన్ చేస్తున్న శాకుంతలం చివరి సినిమా. నేను విరామం తీసుకోవాలనుకుంటున్నా. రాబోయే కాలంలో మహిళా రచయితలు, డైరెక్టర్లతో పనిచేయాలనుంది.
చిన్న చిన్న ఐడియాలతో కథలు సిద్దం చేసుకుని వచ్చే వారితో పనిచేద్దామనుకుంటున్నా. ప్రస్తుతానికి నా ఖాతాలో ఏ సినిమాలు లేవంటూ’ చెప్పుకొచ్చింది సామ్. సమంత ఇప్పటికే నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన మహానటిలో నటించిన విషయం తెలిసిందే. ప్రాజెక్టు కేలో ప్రభాస్, దీపికా పదుకొనే, అమితాబ్ బచ్చన్ ఇతర నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఇవికూడా చదవండి..
Seetimaarr |ఈల వేసేందుకు గోపీచంద్ రెడీ..సీటీమార్ రిలీజ్ డేట్ ఫిక్స్
Chiranjeevi |ముఠామేస్త్రి స్టైల్ లో చిరంజీవి..షేర్ చేసిన బాబీ
Bandla Ganesh | ఇంట్రెస్టింగ్ అప్డేట్..హీరోగా బండ్లగణేశ్..!