ముంబై: సైఫ్ అలీఖాన్‌పై దాడి జరిగిన ఘటన గురించి కరీనా కపూర్(Kareena Kapoor) పోలీసులకు వివరించింది. ఇంట్లోకి చొరబడిన వ్యక్తి.. దూకుడుగా దాడి చేసినట్లు ఆమె చెప్పింది. అయితే ఆ దుండగుడు ఇంట్లో ఉన్న ఆభరణాలను టచ్ చేయలేదని తెలిపింది. బాంద్రా అపార్ట్మెంట్లో జరిగిన అటాక్ గురించి పోలీసులకు ఆమె తెలియజేసింది. సైఫ్‌తో ఘర్షణ జరిగిన సమయంలో ఆ వ్యక్తి చాలా దూకుడుగా వ్యవహరించినట్లు చెప్పింది. పదేపదే సైఫ్‌పై అటాక్ చేయడాన్ని చూశానని కరీనా తెలిపింది.
సైఫ్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లేందుకే ప్రియార్టీ ఇచ్చినట్లు పేర్కొన్నది. దాడి తర్వాత దుండగుడు పారిపోయాడని, విలువైన వస్తువుల్ని ఏమీ తీసుకెళ్లలేదని కరీనా తెలిపింది. పిల్లలు తైముర్, జెహంగిర్ ను రక్షించే ఉద్దేశంతో ఖాన్ ప్రతిదాడి చేసినట్లు ఆమె చెప్పింది. జెహంగిర్ వద్దకు దుండుగడు చేరుకోలేకపోయాడని, ఆ టైంలో ఖాన్‌పై పలుమార్లు అతను అటాక్ చేసినట్లు ఆమె తెలిపింది. దాడి తర్వాత చాలా ఆందోళనకు గురయ్యానని, అందుకే సోదరి కరిశ్మా తనను ఆమె ఇంటికి తీసుకెళ్లినట్లు తెలిపింది.
అయితే ఇంకా సైఫ్ అలీఖాన్ స్టేట్మెంట్ను తీసుకోలేదని పోలీసులు తెలిపారు.