Dulquer Salmaan | కొన్ని రోజులుగా నిద్ర పోలేదంటూ భావోద్వేగానికి గురైన దుల్కర్ సల్మాన్.. ఆందోళనలో ఫ్యాన్స్
Dulquer Salmaan | మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి (Mammootty) తనయుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan). ‘మహానటి’, ‘సీతారామం’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ వ్యక్తిగత, ప్రొఫెషనల్ లైఫ్ గురించి దుల్కర్ సల్మాన్ ఎప్పటికప్పుడు అభిమానులకు అప్ డేట్ ఇస్తుంటాడు. ఆదివారం రాత్రి కూడా దుల్కర్ సల్మాన్ ఓ వీడియోను షేర్ చేశాడు. ఆ వీడియోలో నటుడు ఎమోషనల్ అయ్యాడు. కళ్లు తుడుచుకుంటూ భావోద్వేగానికి గురయ్యాడు.
Dulquer Salmaan | మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి (Mammootty) తనయుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan). భాషతో సంబంధం లేకుండా.. అన్ని రకాల పాత్రల్లో ఒదిగిపోతూ టాలెంట్ హీరోగా రాణిస్తున్నాడు. ‘మహానటి’, ‘సీతారామం’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ వ్యక్తిగత, ప్రొఫెషనల్ లైఫ్ గురించి దుల్కర్ సల్మాన్ ఎప్పటికప్పుడు అభిమానులకు అప్ డేట్ ఇస్తుంటాడు.
కాగా, ఆదివారం రాత్రి కూడా దుల్కర్ సల్మాన్ ఓ వీడియోను షేర్ చేశాడు. ఆ వీడియోలో నటుడు ఎమోషనల్ అయ్యాడు. కళ్లు తుడుచుకుంటూ భావోద్వేగానికి గురయ్యాడు. ‘ఓ సంఘటన కారణంగా కొంతకాలంగా నిద్రపోలేదు. అన్ని విషయాలు ఒకలా ఉండవు. నా జీవితంలో ఇలాంటి సంఘటన తొలిసారి అనుభవిస్తున్నాను. పరిస్థితులు మారిపోయాయి. కానీ, దాన్ని నా మనసులో నుంచి చెరపలేకపోతున్నా. దాని గురించి చెప్పాలనుకుంటున్నా. కానీ, చెప్పలేకపోతున్నా’ అంటూ వీడియోలో తన బాధను వ్యక్తపరిచే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే దుల్కర్ ఆ వీడియోను డిలీట్ చేశాడు. అయితే, అప్పటికే కొందరు అభిమానులు ఆ వీడియోన్ డౌన్ లోడ్ చేసేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. ఇది చూసిన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘దుల్కర్ సల్మాన్ కు ఏమైంది’ , ‘ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు..?’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
https://twitter.com/preethamtweets_/status/1675572060259749889?s=20
Also Read..
Pawan express | విరిగిన చక్రంతో 10 కి.మీ వెళ్లిన రైలు.. ప్రయాణికుల అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం
Madhya Pradesh | మహిళ అనుమానాస్పద మృతి.. మృతదేహాన్ని రెండు రోజులుగా ఫ్రీజర్లోనే పెట్టిన భర్త..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

