Thalapathy Vijay | తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత, నటుడు విజయ్ రాజకీయ ప్రత్యర్థులపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. తన రాజకీయ రంగప్రవేశంపై విమర్శలు చేసే వారికి కౌంటర్ ఇస్తూ, తాను నటుడిని అన్న విషయం అందరికీ తెలిసిందేనని, అదేదో కొత్తగా కనిపెట్టినట్లు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. తాను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నటించడం లేదని, అసలు రాజకీయాల్లో నటనకు చోటు లేదని ఆయన స్పష్టం చేశారు. నిజానికి తనను విమర్శించే వారే రాజకీయాల్లో నాటకాలు ఆడుతున్నారని, ప్రజలను మభ్యపెడుతున్నారని విజయ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాజకీయ ప్రయాణంలో తాను అత్యంత చిత్తశుద్ధితో ఉన్నానని, తన నటన కేవలం సినిమాలకే పరిమితమని ఈ సందర్భంగా చెప్పుకోచ్చాడు. ప్రత్యర్థులు చేస్తున్న వ్యక్తిగత విమర్శలను తిప్పికొడుతూ విజయ్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారడమే కాకుండా తమిళ రాజకీయాల్లో వేడిని పెంచుతున్నాయి.
“Vijay is an actor .. Vijay is an actor.. Yes.. I’m an actor.. Ennamo pudhusa kandu pudicha madhri.. I didn’t act after coming to Politics.. I didn’t act in politics.. But You people are putting drama in politics..”
– #ThalapathyVijay‘s Today’s Speech pic.twitter.com/FSMa6bNNhs
— Laxmi Kanth (@iammoviebuff007) April 21, 2026