సాయిరాం శంకర్ హీరోగా తేజ డైరెక్షన్ లో నటించిన వెయ్యి అబద్దాలు (1000 Abaddalu) చిత్రంతో సిల్వర్ స్క్రీన్ పై మెరిసింది అందాల భామ ఈస్తర్ నోరోన్హా (Ester Noronha). ఆ తర్వాత భీమవరం బుల్లోడా,గరమ్, జయ జానకి నాయక చిత్రాల్లో నటించింది. ఇటీవలే ఈ భామ చేసిన చిట్ చాట్ వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ వీడియోలో వైరల్ అయ్యేంత విషయం ఏముందనే కదా మీ డౌటు. సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ అంశం సాధారణమైందే. ఇదే విషయంపై తన కెరీర్లో ఎదురైన అనుభవాలను షేర్ చేసుకుంది ఈస్తర్. ఈ భామ సింగర్ కమ్ యాక్టర్ నోయెల్‌ను పెళ్లి చేసుకున్నా..ఎన్నో ఏళ్లు ఆ బంధం సాగలేదు.
వారిద్దరు కొద్ది కాలానికే విడాకులు తీసుకున్నారు. అయితే కెరీర్ మొదట్లో సక్సెస్ అందుకున్న ఈస్తర్ ఆ తర్వాత కెరీర్ కొనసాగించకపోవడం వెనుకున్న కారణాన్ని చెప్పుకొచ్చింది. కెరీర్ కొనసాగించకపోవడానికి క్యాస్టింగ్ కౌచ్ (casting couch) మెయిన్ కారణమని చెప్పింది. యాక్టర్, డైరెక్టర్ చెప్పినట్టు వినకపోవడం వల్లే తాను చాలా సినిమాల నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది. తాను షార్ట్ కట్ రూట్లో విజయాన్ని అందుకోవాలని అనుకోలేదని అందుకే సినిమా కెరీర్ మందగించిందని అన్నది ఈస్తర్.
కాస్టింగ్ కౌచ్ ఎఫెక్ట్‌తో యాక్టింగ్‌కు దూరమైన ఈస్తర్కు మళ్లీ అవకాశాలు వచ్చి కెరీర్ ముందుకు సాగాలని కోరుకుంటున్నారు సినీ జనాలు. ఈ బ్యూటీ టాలెంట్ గుర్తించి మంచి సినిమా ఆఫర్లు రావాలని అందరూ విష్ చేస్తున్నారు.