VasudevaSutham | ఆ నమ్మకంతోనే అడ్వాన్స్ ఏం అడగలేదు.. ‘వసుదేవసుతం’పై మాస్టర్ మహేంద్రన్
VasudevaSutham | మాస్టర్ మహేంద్రన్ హీరోగా తెరకెక్కుతున్న వసుదేవసుతం (Vasudheva Sutham) ట్రైలర్ను లాంచ్ చేశారు. దేవుడి అస్థిత్వాన్ని ప్రశ్నించే ఎవడికి భూమి మీద బ్రతికే హక్కు లేదు.. అంటూ సాగుతున్న ట్రైలర్ ఒడిశా పూరి జగన్నాదుడికి దగ్గర ఉండే కథగా మరో డివోషనల్ థ్రిల్లర్గా రాబోతుందని చెప్పకనే చెబుతోంది.
VasudevaSutham | దేవి ఫేం చైల్డ్ ఆర్టిస్ట్, కోలీవుడ్ యాక్టర్ మాస్టర్ మహేంద్రన్ హీరోగా తెరకెక్కుతున్న మూవీ వసుదేవసుతం (Vasudheva Sutham). మల్టీ లింగ్యువల్ ప్రాజెక్టుగా వస్తోన్న ఈ మూవీని వైకుంఠ్ బోను డైరెక్ట్ చేస్తున్నాడు. జులై 10న విడుదలవుతుండటంతో ప్రమోషన్స్లో భాగంగా మేకర్స్ ట్రైలర్ను లాంచ్ చేశారు. దేవుడి అస్థిత్వాన్ని ప్రశ్నించే ఎవడికి భూమి మీద బ్రతికే హక్కు లేదు.. అంటూ సాగుతున్న ట్రైలర్ ఒడిశా పూరి జగన్నాదుడికి దగ్గర ఉండే కథగా మరో డివోషనల్ థ్రిల్లర్గా రాబోతుందని చెప్పకనే చెబుతోంది.
ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో హీరో మాస్టర్ మహేంద్రన్ మాట్లాడుతూ.. కృష్ణుడి మీద తీసిన ఈ కంటెంట్ జనాలకు నచ్చాలని బాగా తెరకెక్కించారు. ఇందులో అద్భుతమైన కంటెంట్ ఉంది. ఇలాంటి ఓ పాత్ర సినిమా దొరకడం నా అదృష్ణం. నిర్మాత మీదున్న నమ్మకంతోనే అడ్వాన్స్ ఏం అడగలేదు. ఏ యాక్టర్ నుంచి ఎంత రాబట్టుకోవాలనేది డైరెక్టర్ వైకుంఠ్కు బాగాతెలుసు. మణిశర్మ మ్యూజిక్ మా సినిమాకు ప్లస్ అవుతాయని ధీమా వ్యక్తం చేశాడు.
మణిశర్మకు కథ చెప్పా. నచ్చితేనే సినిమా చేయండని ఆయనతో చెప్పాను. కథ నచ్చడంతో వెంటనే పని మొదలుపెట్టారని డైరెక్టర్ వైకుంఠ్ బోను చెప్పాడు. సినిమా చూసిని తర్వాత మణిశర్మ పాటలు, ఆర్ఆర్ గురించి తప్పుకుండా మాట్లాడుతారు. ఇది వన్ మ్యాన్ షో. చివరి 45 నిమిషాలు నెక్ట్స్ లెవల్లో ఉంటుంది. వసుదేవసుతం ఎవరినీ నిరాశ పరచదని అన్నాడు.
వసుదేవసుతం మూవీ నుంచి మేకర్స్ ఇప్పటికే లాంచ్ చేసిన ఫస్ట్ లుక్, గ్లింప్స్, పాటలు ఇప్పటికే సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి. దైవిక అంశాల చుట్టూ తిరిగే కథాంశంతో సినిమా ఉండబోతున్నట్టు గ్లింప్స్ హింట్ ఇచ్చేస్తుంది. మాస్టర్ మహేంద్రన్ త్రిశూలాన్ని పట్టుకున్న విజువల్స్ గూస్బంప్స్ తెప్పిస్తూ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి. ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా ఉత్కంఠభరితమైన నిధి సాహసం నేపథ్యంలో సినిమా ఉండబోతున్నట్టు గ్లింప్స్ ద్వారా మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.
వసుదేవసుతం ట్రైలర్..
#VasudevaSutham Trailer Out Now
In cinemas from July 10th ! pic.twitter.com/Jh75O6EOPo
— Rajesh Manne (@rajeshmanne1) June 23, 2026
Read Also :
Volcano eruption | అగ్నిపర్వతం నుంచి భారీ విస్ఫోటనం.. పరుగులు తీసిన పర్యాటకులు
Prabhas | 2027 ప్రభాస్ నామ సంవత్సరం.. ఒకటి కాదు మూడు భారీ ట్రీట్స్ ప్లాన్ చేస్తున్న రెబల్ స్టార్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

