Miss Shetty Mr Polishetty | టాలీవుడ్ నుంచి త్వరలో సందడి చేయబోతున్న చిత్రాల్లో ఒకటి Miss శెట్టి మిస్టర్ Polishetty (Miss Shetty Mr Polishetty). నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty), అనుష్కా శెట్టి (Anushka shetty) హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. సెప్టెంబర్ 7 సినిమా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది నవీన్ పొలిశెట్టి టీం. ప్రమోషన్స్‌లో భాగంగా ఇవాళ మీడియాతో చిట్ చాట్ చేశాడు.
ఈ చిత్రానికి హైలెట్స్ ఏంటని ఓ రిపోర్టర్ అడిగితే..? ఈ సినిమాకు కథ, నటీనటులతోపాటు సినిమా చూస్తున్నప్పుడు అందమైన అనుభూతి కలుగుతుందన్నాడు. ట్రైలర్లో 30 శాతం ఎంటర్టైన్మెంట్ అంటే.. సినిమాలో వంద శాతం ఉంటుంది. సినిమా మొదలయ్యాక 20 నిమిషాల తర్వాత నవీన్ పొలిశెట్టి వస్తాడు. స్వీటీ మొదటి సినిమా ఎప్పుడు చూశారని అడిగితే.. అరుంధతి సినిమా చూసి అనుష్కకు పెద్ద అభిమానిని అయ్యా. 17 ఏండ్ల కెరీర్‌ను పూర్తి చేసిన సందర్భంగా అనుష్కను విష్ చేశాం. ఆ రోజు తీసిన సన్నివేశాలు చాలా హెలేరియస్‌గా ఉంటాయన్నాడు.
రియల్ లైఫ్‌లో స్టాండప్ కమెడియన్ అనగానే ఎలా అనిపించిందని ప్రశ్నించగా.. స్టాండప్ కామెడీ చేయడం ఛాలెంజింగ్‌గా అనిపించింది. తెలుగు ప్రేక్షకులకు తెలుగు స్టాండప్ కామెడీని ఎందుకు పరిచయం చేయకూడదని.. మేమంతా రియల్ కామెడీ క్లబ్స్ కెళ్లి షూటింగ్ చేశాం. రియల్ ఆడియెన్స్ వచ్చి కూర్చున్నారు.. ఆ తర్వాత సిద్దు అనే క్యారెక్టర్ వచ్చి.. రోల్ చేయగానే ఒకే టేక్‌లో సీన్ ఒకే చేశామని చెప్పుకొచ్చాడు నవీన్ పొలిశెట్టి.
ఇప్పటికే ఈ మూవీ నుంచి మేకర్స్ లాంఛ్ చేసిన టీజర్, పోస్టర్లతోపాటు నో నో నో, హతవిధి, లేడీ లక్ సాంగ్స్‌కు మంచి స్పందన వస్తోంది. రీసెంట్గా విడుదల చేసిన కొత్త లుక్‌లో స్వీటీ సూపర్ స్లిమ్‌గా కనిపిస్తూ.. నాలుగు పదుల వయస్సులోనూ యంగ్ హీరోయిన్లకు గట్టిపోటీనిస్తూ టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తోంది.
Miss శెట్టి మిస్టర్ Polishetty తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. డిఫరెంట్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చి సోలో లైఫ్ లీడ్ చేస్తున్న మిస్టర్ పొలిశెట్టి, మిస్ పొలిశెట్టి మధ్య సాగిన ఫన్నీ లవ్ ట్రాక్‌తో సినిమా ఉండబోతున్నట్టు ఇప్పటికే లాంఛ్ చేసిన టీజర్, పాటలతో క్లారిటీ ఇచ్చేశాడు డైరెక్టర్. సింగిల్స్ గా ఉన్న నవీన్ పొలిశెట్టి, అనుష్క మధ్య ఎలాంటి ట్రాక్ ఉండబోతుందనేది మాత్రం తెలియాలంటే మరో మూడు రోజులు వెయిట్ చేయాల్సిందే.
నవీన్ పొలిశెట్టి చిట్ చాట్..
ప్రెస్ మీట్ ఫొటోలు..
Clicks 📸📸 From Grand Press Meet.🤩#MissShettyMrPoliShetty
▶️https://t.co/SRx7ASNDmk#MSMPonSep7th@MsAnushkaShetty @NaveenPolishety @adityamusic @uv_creations @filmymahesh @shreyasgroup pic.twitter.com/GbHCruiRhG
— BA Raju’s Team (@baraju_SuperHit) September 4, 2023
Miss శెట్టి మిస్టర్ Polishetty టీజర్..
Miss శెట్టి మిస్టర్ Polishetty ట్రైలర్..
లేడీ లక్ ఫుల్ లిరికల్ వీడియో సాంగ్..
లేడీ లక్ ప్రోమో..
హథవిది లిరికల్ వీడియో సాంగ్..
నోనోనో లిరికల్ సాంగ్..