Rana | బాబాయి, నేను కరోనా టైంలోనే డిసైడ్ అయ్యాం : రానా
టాలీవుడ్ (Tollywood) యాక్టర్లు వెంకటేశ్ (Venkatesh), రానా (Rana) నెట్‌ఫ్లిక్స్ సిరీస్ రానా నాయుడు (Rana Naidu)లో నటిస్తున్న విషయం తెలిసిందే. రానా నాయుడు మార్చి 10న నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో ప్రీమియర్ కాబోతుంది. ఈ సందర్భంగా రానా నాయుడు టీం హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది.
టాలీవుడ్ (Tollywood) యాక్టర్లు వెంకటేశ్ (Venkatesh), రానా (Rana) నెట్‌ఫ్లిక్స్ సిరీస్ రానా నాయుడు (Rana Naidu)లో నటిస్తున్న విషయం తెలిసిందే. అమెరికన్ హిట్ సిరీస్ రే డోనోవ్యాన్‌కు అడాప్షన్గా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతుంది. కరణ్ అన్షుమాన్, సుపర్ణ్ వర్మ దర్శకత్వం వహించిన రానా నాయుడు మార్చి 10న నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో ప్రీమియర్ కాబోతుంది. ఈ సందర్భంగా రానా నాయుడు టీం హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది. రానా చిట్ చాట్ సెషన్లో పాల్గొని.. వెబ్ ప్రాజెక్ట్ విశేషాలు పంచుకున్నాడు.
మీడియానుద్దేశించి రానా మాట్లాడుతూ.. మహమ్మారి టైంలో తాను, బాబాయి వెంకటేష్ ఒకరికొకరు చర్చించుకున్న తర్వాత OTT ప్రపంచంలోకి ఎంట్రీ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు చెప్పాడు. రానా నాయుడు చీకటి ప్రపంచం చుట్టూ నడిచే ఫ్యామిలీ డ్రామా.. అని ఇది సినిమాగా తీయడం చాలా కష్టమని రానా అభిప్రాయపడ్డాడు. కథ వినగానే నాకు ఆసక్తికరంగా అనిపించింది. రానా నాయుడు ముంబైలో జరిగే దక్షిణ భారతీయుల గ్యాంగ్‌స్టర్ కథ అని చెప్పుకొచ్చాడు.
ఈ ప్రాజెక్ట్‌లో తాను సినిమా యాక్టర్లు, పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులను వారి సమస్యల నుంచి రక్షించే పాత్రలో నటిస్తున్నట్టు చెప్పాడు రానా. తాను, బాబాయి కలిసి పనిచేయాలనుకున్నప్పుడు ఏదైనా ప్రత్యేకంగా చేయాలనుకున్నామన్నాడు. రానా నాయుడు ప్రాజెక్ట్‌లో బాబాయికి ప్రత్యర్థిగా నటించడం చాలెంజింగ్ అంశమని చెప్పుకొచ్చాడు రానా.
రానా నాయుడు టీం ప్రెస్‌మీట్ స్టిల్స్..
Clicks of Victory @VenkyMama, @RanaDaggubati and Team #RanaNaidu from the Grand Press Meet in Hyderabad. 📸 ✨#RanaNaiduOnNetflix from March 10th @NetflixIndia @krnx @suparn #SunderAaron #SurveenChawla @nowitsabhi @sushant_says @AshishVid pic.twitter.com/xfPQYwk74t
— Suresh PRO (@SureshPRO_) March 7, 2023
Read Also :
Allu arjun | అల్లు అర్జున్ అరుదైన రికార్డు.. సౌత్ నుంచి తొలి నటుడిగా..
Thalaivar 170 | తగ్గేదేలే.. రజినీకాంత్ 170వ సినిమా అప్డేట్
Mahesh Babu | సూపర్ ఫిట్‌గా మహేశ్ బాబు.. ట్రెండింగ్‌లో నయా వర్కవుట్ లుక్స్
VT13 | వరుణ్ తేజ్ వార్ డ్రామా VT13 ఇంట్రెస్టింగ్ అప్డేట్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

