Pravasthi | గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ప్రారంభించిన పాడుతా తీయగా షోతో ఎంతో మంది సింగర్స్ వెలుగులోకి వచ్చారు. వారిలో ప్రవస్తి కూడా ఒకరు. చిన్న వయస్సులోనే పాడుతా తీయగా షోలో పాల్గొని అదరగొట్టి అందరి ప్రశంసలు అందుకుంది. ఇక ఇప్పుడు బాలు తనయుడు చరణ్ హోస్ట్ చేస్తున్న పాడుతా తీయగా షోలోను పాల్గొంది. అయితే రీసెంట్గా ప్రవస్థిని ఎలిమినేట్ చేయడంతో ఆమె తన సోషల్ మీడియా వేదికగా జడ్జెస్‌పై సంచలన ఆరోపణలు చేసింది. ‘పాడుతా తీయగా’ కార్యక్రమంలో న్యాయనిర్ణేతలు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని ప్రవస్తి ఆరాధ్య ఆరోపించారు.
కీరవాణి స్వరపరిచిన పాటలు పాడిన వారికే అధిక మార్కులు ఇస్తున్నారని ఆమె అన్నారు. జీవనోపాధి కోసం పెళ్లిళ్లు మరియు ఇతర కార్యక్రమాల్లో పాటలు పాడతానని చెప్పినప్పుడు, న్యాయ నిర్ణేతలు తనని కించపరిచినట్టు ప్రవస్తి వాపోయింది. సెట్లో తనను బాడీ షేమింగ్ చేశారని, అలానే శరీరాకృతిపై పలు వ్యాఖ్యలు చేసి మానసికంగా బాధించారని ప్రవస్తి తెలియజేసింది. తనని ఎలిమినేట్ చేయడానికి ముందుగానే ప్లాన్ చేశారని సింగర్ ప్రవస్తి ఆరాధ్య తెలియజేసింది. ఇక పలు మీడియా సంస్థలతో ముచ్చటించిన ఆమె షాకింగ్ విషయాన్ని తెలియజేసింది.
తనకు బెదిరింపులు వస్తున్నాయని, సోషల్ మీడియాలో తనని కొందరు బెదిరిస్తున్నారని, తనకు సపోర్ట్ చేసిన సింగర్స్ తో సంబంధాలను అంటగడుతున్నారంటూ మీడియాలో ఈ విషయాలు వెల్లడించింది. సోషల్ మీడియాలో కొందరు వారిని వేసేస్తాం, వీరిని వేసేస్తాం అంటూ బెదిరిస్తున్నారు. ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి కామెంట్లు పెడుతున్నట్టుగా తెలిపింది. కాగా, సింగర్ ప్రవస్తి ఆరాధ్యకి జరిగిన అన్యాయంపై నెటిజన్లు, సంగీత ప్రియులు స్పందిస్తున్నారు. సింగర్ సునీతని ట్రోల్ చేస్తున్నారు. ఇతర జడ్జిలని కూడా ట్రోల్ చేస్తున్నారు. ప్రవస్తి విడుదల చేసిన వీడియోలో.. పాడుతా తీయగా వంటి షోలలో పాల్గొనాలనుకునే సింగర్స్‌కి నేను ఒక్క విషయం చెప్పదలచుకుంటున్నాను… రికమెండేషన్స్, జడ్జీలకు తెలిసిన వ్యక్తులైతేనే ఆ షోలకి వెళ్లండి. లేదంటే అక్కడ న్యాయం జరగకపోగా, మానసికంగా నష్టపోతారు అని పేర్కొంది.