Bhola Shankar Movie | మాములుగా ఆడియో ఫంక్షన్లంటే సినిమా గురించి, దాని తాలుకూ టెక్నిషియన్ల పనితనం గురించి గొప్పగా మాట్లాడుతుంటారు. త్రివిక్రమ్ లాంటి వాళ్లు వాటితో పాటు జీవిత సత్యాలు, విలువలు గురించి చెబుతుంటారు. ఇక ఆయన స్పీచ్‌లకు సెపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు. ముఖ్యంగా మెగా ఫ్యామిలీ, పవన్ కళ్యాణ్ గురించి ఆయన చెప్పే స్పీచ్‌లు వీర లెవల్లో ఉంటాయి. అలాంటిది త్రివిక్రమ్ స్పీచ్‌నే డామినేట్ చేసిన మరో వ్యక్తి బండ్ల గణేష్. మెగా ఫ్యామిలీకి బండ్ల వీరాభిమాని. ఇక పవన్ కళ్యాణ్‌కు భక్తుడు. ఆయన స్టేజీ మీదకు వచ్చిండంటే చాలు ఆడిటోరియం మొత్తం అరపులు కేకలతో మార్మోగిపోతుంది. బండ్ల గణేష్ ఎలాంటి స్పీచ్ ఇస్తాడో అని వేడుకకు వచ్చిన ప్రేక్షకులంతా వేయి కళ్లతో ఎదురు చూస్తుంటారు.
అయితే ఈ మధ్య బండ్ల గణేష్ ఎక్కువగా మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఎలాంటి సినిమా ఫంక్షన్లలో కనిపించడం లేదు. ఆ లోటు మెగా అభిమానుల్లో చాలానే ఉంది. కాగా ఇప్పుడు మెగా అభిమానులకు అవుట్ సెలబస్ రూపంలో హైపర్ ఆది వచ్చాడు. ఆదివారం జరిగిన భోళా శంకర్ వేడుకలో హైపర్ ఆది స్పీచ్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. దాదాపు పావుగంట సమయం తీసుకుని మెగా ఫ్యామిలీ గురించి, రామ్ చరణ్ గురించి, పవన్ కళ్యాణ్ గురించి ఇలా మెగా స్పీచ్‌ను కుమ్మేశాడు. చిరంజీవి సైతం ఆది స్పీచ్‌కు కళ్లు చెమ్మగిల్చాడంటే ఏ స్థాయిలో హైపర్ ఆది మాట్లాడాడో అర్థం చేసుకోవచ్చు. పక్కనే కూర్చున్న అల్లు అరవింద్ ఆశ్చర్యపోతూ స్పీచ్ వినడం మరో హైలేట్.
చిరంజీవి కెరీర్ బిగెనింగ్ స్ట్రగుల్స్ నుంచి వాల్తేరు వీరయ్య సక్సెస్ వరకు ప్రతీ విషయాన్ని చెప్పాడు. చిరంజీవిపై విమర్శలు చేసే వారికి కౌంటర్ ఇస్తూ రెచ్చిపోయాడు. అన్నయ్య మంచోడు కాబట్టి ముంచారు. తమ్ముడు మొండొడు ముంచడాలు ఉండవు, తాడో పోడో తెంచడాలే అంటూ మాస్ లెవల్లో ఎలివేషన్ ఇచ్చాడు. చిరుత సినిమాలో చరణ్‌పై విమర్శలు చేసిన వారే రంగస్థలంలో ఆయన నటనను చూసి చప్పట్లు కొట్టారని చెప్పాడు. టెండుల్కర్ కొడుకు టెండుల్కర్ కాలేడు. అమితాబ్ కొడుకు అమితాబ్ కాలేడు. కానీ చిరంజీవి కొడుకు చిరంజీవి అయ్యాడు. చిరంజీవిని మించి పోయాడంటూ చరణ్‌పై ఇచ్చిన ఎలివేషన్‌కు ఆడిటోరియం మొత్తం ఊగిపోయింది.
మొత్తంగా ఒక పావు గంట పాటు హైపర్ ఆది మెగా అభిమానుల్లో తిరుగులేని జోష్ నింపాడు. దెబ్బకు గత రాత్రి నుంచి ట్విట్టర్ ట్రెండింగ్‌లోకి వచ్చేశాడు. ప్రస్తుతం ఏ సోషల్ మీడియా ప్లాట్ఫార్మ్ చూసిన ఆది స్పీచ్ గురించే చర్చలు జరుగుతున్నాయి. మొత్తగానికి మెగా ఫ్యామిలీపై తనకున్న అభిమానాన్ని స్పీచ్ రూపంలో చెప్పి మెగా అభిమానుల మనసు గెలుచుకున్నాడు.