Sarath Babu | శరత్‌బాబు పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది? లేటెస్ట్ అప్డేట్ ఇదీ..
Sarath Babu | సీనియర్ నటుడు శరత్‌బాబు ఆరోగ్యంపై రకరకాల వదంతులు పుట్టుకొస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రి వర్గాలు కీలక అప్డేట్ ఇచ్చాయి. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగానే ఉందని పేర్కొంటూ తాజాగా ఓ హెల్త్ బులిటెన్‌ను విడుదల చేశాయి.
Sarath Babu | సీనియర్ నటుడు శరత్‌బాబు ఆరోగ్యంపై రకరకాల వదంతులు పుట్టుకొస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రి వర్గాలు కీలక అప్డేట్ ఇచ్చాయి. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగానే ఉందని పేర్కొంటూ తాజాగా ఓ హెల్త్ బులిటెన్‌ను విడుదల చేశాయి.
ప్రస్తుతం శరత్‌బాబు అవయవాల పనితీరు నిలకడగానే ఉందని.. అయినప్పటికీ ఆయన ఆరోగ్య పరిస్థితి క్రిటికల్‌గానే ఉందని ఏఐజీ ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం శరత్‌బాబుకు వెంటిలేటర్‌పై ట్రీట్మెంట్ కొనసాగుతోందని తెలిపారు. ఆయన ఆరోగ్యంపై ఎలాంటి వదంతులను ప్రచారం చేయవద్దని విజ్ఞప్తి చేశారు. శరత్‌బాబు ఆరోగ్య పరిస్థితి గురించి ఆయన కుటుంబసభ్యులు లేదా ఏఐజీ ఆస్పత్రి వర్గాలు ఎప్పటికప్పుడూ మీడియాకు తెలియజేస్తారని స్పష్టం చేశారు.
చాలా రోజులుగా శరత్‌బాబు ఆస్పత్రిలో చికిత్స పొందుతుండటంతో ఆయన ఆరోగ్యంపై రకరకాల వదంతులు పుట్టుకొస్తున్నాయి. బుధవారం రాత్రి అయితే ఏకంగా శరత్‌బాబు మరణించారనే రూమర్స్ బయటకొచ్చాయి. వాటిని నిజమని నమ్మి చాలామంది ఆయనకు సంతాపం తెలిపారు. ఇవి చూసిన శరత్‌బాబు సోదరి సీరియస్ అయ్యారు. తన అన్నయ్య క్షేమంగానే ఉన్నారని బుధవారం రాత్రే ఒక ప్రకటన విడుదల చేశారు. ఆయన్ను ఐసీయూ నుంచి రూమ్‌కి షిఫ్ట్ చేశారని.. త్వరలోనే పూర్తిగా కోలుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. శరత్‌బాబు మరణించినట్లు వస్తున్న వార్తలను నమ్మొద్దని ఆయన సోదరుడి కుమారుడు ఆయుష్ తేజస్ గురువారం ఉదయం విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం శరత్‌బాబు పరిస్థితి నిలకడగా ఉందని.. పూర్తిగా కోలుకోవడానికి మరికొంత సమయం పడుతుందని వైద్యులు చెప్పారని వెల్లడించారు.
Read More :
Ileana D’Cruz | తల్లి కాబోతున్నట్లు ఇటీవలే ప్రకటించిన ఇలియానా.. ఇప్పుడు వీడియోతో షాకిచ్చింది!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

