Ileana D’Cruz | తల్లి కాబోతున్నట్లు ఇటీవలే ప్రకటించిన ఇలియానా.. ఇప్పుడు వీడియోతో షాకిచ్చింది!
Ileana D'Cruz | ప్రముఖ సినీ తార ఇలియానా.. తాను ఇప్పుడు గర్భవతిగా ఉన్నానని, త్వరలో ఓ బిడ్డకు స్వాగతం పలుకబోతున్నానని గత నెల తన అభిమానులకు శుభవార్త చెప్పింది. సోషల్ మీడియా వేదికగా ఇలియానా చేసిన ఆ ప్రకటన ఇంటర్నెట్లో పెద్ద కోలాహలమే సృష్టించింది.
న్యూఢిల్లీ: ప్రముఖ సినీ తార ఇలియానా.. తాను ఇప్పుడు గర్భవతిగా ఉన్నానని, త్వరలో ఓ బిడ్డకు స్వాగతం పలుకబోతున్నానని గత నెల తన అభిమానులకు శుభవార్త చెప్పింది. సోషల్ మీడియా వేదికగా ఇలియానా చేసిన ఆ ప్రకటన ఇంటర్నెట్లో పెద్ద కోలాహలమే సృష్టించింది. అభిమానులు పెద్ద ఎత్తున అభినందనలు తెలియజేశారు. కానీ కొంత మంది నెటిజన్లు మాత్రం ఇలియానా కడుపులో ఉన్న బిడ్డకు తండ్రి ఎవరంటూ అప్పటి నుంచి ఇప్పటివరకు ఎగతాళి కామెంట్స్ చేస్తూనే ఉన్నారు.
అయినా, ఆ కామెంట్లన్నింటినీ డోంట్ కేర్ అంటూ ఇప్పుడు ఆమె ఏకంగా బేబీ బంప్ వీడియోనే ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్ చేసింది. గత నెలలో తాను గర్భవతినని ప్రకటించిన తర్వాత ఆమె బేబీ బంప్ వీడియో షేర్ చేయడం ఇదే తొలిసారి. ఆ వీడియోలో ఇలియానా బెడ్‌పై కాళ్లు చాపి కూర్చుని ఉంది. ఆమె చేతిలో ఓ నల్లటి మగ్ ఉంది. ఈ సందర్భంగా ఆమె తన గర్భాన్ని చూపించింది. ఆ పోస్టుపై ‘లైఫ్ లేట్లీ’ అనే టెక్ట్స్ రాసింది.
కాగా, ఇలియానా కడుపులో ఉన్న బిడ్డకు తండ్రి ఎవరని నెటిజన్లు ప్రశ్నిస్తుండగా.. ప్రస్తుతం ఆమె కత్రినా కైఫ్ సోదరుడు సెబాస్టియన్ లారెంట్ మిచెల్‌తో డేటింగ్లో ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

