సందీప్‌కిషన్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఊరు పేరు భైరవకోన’. ఏకే ఎంటర్టైన్మెంట్, హాస్య మూవీస్ పతాకాలపై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా ‘హమ్మా హమ్మా’ అనే రెండో గీతాన్ని విడుదల చేశారు. నాయకానాయికలు సందీప్‌కిషన్, వర్ష బొల్లమ్మలపై చిత్రీకరించిన ఈ పాట ఫాస్ట్‌బీట్‌తో ఆకట్టుకుంటున్నది.
శేఖర్‌చంద్ర స్వరపరచిన ఈ గీతానికి తిరుపతి జవానా సాహిత్యాన్నందించారు. రామ్ మిరియాల ఆలపించారు. ప్రేయసి పట్ల ఆరాధనా భావాన్ని కనబరిచే కథానాయకుడి అంతరంగాన్ని ఆవిష్కరిస్తూ ఈ పాట చక్కటి ప్రణయ భావాలతో సాగింది. ఆద్యంతం సస్పెన్స్, థ్రిల్లర్ అంశాలతో సాగే చిత్రమిదని, భైరవకోనలో జరిగే ఘటనలు అనుక్షణం ఉత్కంఠను పంచుతాయని చిత్ర బృందం పేర్కొంది.