సినిమా షూటింగ్స్‌లో అగ్ని ప్రమాదాలు జరుగుతుండడం మనం గమనిస్తూనే ఉన్నాం. ప్రమాదం జరిగినప్పుడు హడావిడి చేస్తున్నారు, ఆ తర్వాత మళ్లీ అజాగ్రత్తగా వ్యవహరిస్తుండడంతో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజగా హైదరాబాద్ ఫిలింనగర్లో జరుగుతున్న సినిమా షూటింగ్ సెట్లోఅగ్నిప్రమాదం జరిగింది.
షూటింగ్‌కి సంబంధించిన కారు జనరేటర్ నుండి ఆకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అయితే ఈ ప్రమాదం జనరేటర్ నుండి డీజిల్ లీక్ కావడం వలనే జరిగినట్టు తెలుస్తుంది. జనరేటర్ నుండి వచ్చిన మంటలు చుట్టు పక్కన ప్రాంతాలకి కూడా వ్యాపించాయి. దీంతో అగ్ని ప్రమాదంలో షాపులు, కార్లు కాలిపోయాయి.
ఈ ఘటనలో హొండా ఐ20 కారు పూర్తిగా దగ్ధమైంది. అయితే ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఆస్తినష్టం భారీగా జరిగినట్టు తెలుస్తుంది.ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారిస్తున్నట్టు సమాచారం.