Fighter Collections : బాక్సాఫీస్ వద్ద భారీ ప్రారంభ వసూళ్లు రాబట్టి ఆపై డీలా పడిన హృతిక్ రోషన్, దీపికా పదుకోన్ నటించిన ఫైటర్ మూవీ రెండో వారాంతంలో పుంజుకుంది. సిద్ధార్ధ్ ఆనంద్ నిర్ధేశకత్వంలో తెరకెక్కిన ఫైటర్ పదో రోజు శనివారం అన్ని భాషల్లో కలిపి దేశవ్యాప్తంగా రూ. 10.5 కోట్లు రాబట్టింది.
దీంతో ఈ మూవీ దేశీ కలెక్షన్లు రూ. 163 కోట్లకు చేరాయి. ఏరియల్ యాక్షన్ సీక్వెన్స్‌తో ఆకట్టుకునే ఫైటర్ మూవీ ఓవర్సీస్లో భారీ వసూళ్లను రాబడుతోంది. పదో రోజు ఫైటర్ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ. 15.19 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిందని సినీ ట్రేడ్ విశ్లేషకులు మనోబాల విజయబాలన్ తెలిపారు.
ఇక ప్రపంచవ్యాప్తంగా ఫైటర్ మూవీ పదిరోజుల్లో 287.7 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఈ మూవీలో అనిల్ కపూర్, కరణ్ సింగ్ గ్రోవర్, అక్షయ్ ఓబెరాయ్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు.
Read More :