NTR | తారక్, చరణ్ కలిసి ‘నాటునాటు..’ అంటూ స్టెప్పులేస్తే వారి ఆటపాట గురించి ప్రపంచం మాట్లాడుకుంది. ఇప్పుడు ఆ ఫీట్ మళ్లీ రిపీట్ కానుందని సమాచారం. కాకపోతే.. తారక్ అలాగే ఉన్నారు. చరణ్ ప్లేస్‌లోకి మాత్రం హృతిక్‌రోషన్ వచ్చి చేరారు. ప్రస్తుతం ముంబైలో ‘వార్ 2’ షూటింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తారక్, హృతిక్‌లపై ఓ సాంగ్‌ని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు ఆయాన్ ముఖర్జీ.
బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా కూడా ఈ పాటలో భాగమైంది. ఇదొక పబ్ సాంగ్. బ్యాగ్రౌండ్లో కొన్ని సీన్స్ జరుగుతూ ఉంటే ఈ పాట నడుస్తూ ఉంటుందట. కథలో కీలకమైన సందర్భంలో వచ్చే ఈ పాటలో తారక్, హృతిక్ పోటీపడి మరీ స్టెప్పులేయనున్నారట. ఈ పాట సినిమాకే హైలైట్ ఆవుతుందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. మోస్ట్ వాంటెడ్ పాన్ ఇండియా మల్టీస్టారర్‌గా తెరక్కెక్కుతున్న ఈ చిత్రంలో హృతిక్ రోషన్ పాత్రకు దీటైన పాత్రను తారక్ పోషిస్తున్నారని తెలుస్తున్నది. ఆదిత్య చోప్రా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే.