న్యూఢిల్లీ: హృతిక్ రోషన్ ఇరగదీస్తున్నాడు. న్యూ ఇయర్‌కు ఇన్‌స్టా పోస్టుతో ఆకట్టుకున్నాడు. 6 ప్యాక్ లుక్‌లో ఉన్న ఫోటోను అతను ఇన్‌స్టాలో పెట్టాడు. పర్ఫెక్ట్ బాడీ.. టోన్డ్ స్కిన్‌తో ఉన్న యాబ్స్లో హృతిక్ కేక పుట్టిస్తున్నాడు. జిమ్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్న ఆ ఫోటోకు ఓ క్యాప్షన్ కూడా ఇచ్చాడు. ఆల్రైట్. లెట్స్ గో. హ్యాష్‌ట్యాగ్ 2023 అంటూ న్యూ ఇయర్‌కు వెల్కమ్ చెప్పాడు.
బాలీవుడ్ స్టార్ కొత్త లుక్ ఫోటోను షేర్ చేయగానే.. లైక్‌లు, కామెంట్లు హోరెత్తాయి. ఫిల్మ్ ఇండస్ట్రీ మిత్రులు కామెంట్ సెక్షన్లో పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. వరుణ్ ధావన్, పునిత్ మల్హోత్రా, జీబ్రాన్ ఖాన్లు బూమ్ బూమ అంటూ ఎమోజీల వర్షం కురిపించారు.
ఇటీవల హృతిక్ తన ఇద్దరు కుమారులతో ఫ్రాన్స్‌లో కనిపించాడు. అతని గర్ల్‌ఫ్రెండ్ సాబా ఆజాద్ కూడా అక్కడే టూర్ చేస్తోంది. ఆల్ప్స్ కొండల్లోని కౌర్చెవెల్ స్కీ రిసార్ట్ ప్రాంతంలో వాళ్లంతా ఎంజాబ్ చేస్తున్నారు. దానికి చెందిన ఓ ఫోటోను కూడా అతను ఇటీవల అప్లోడ్ చేశాడు.