Hrithik Roshan | హృతిక్ రోషన్ గర్ల్‌ఫ్రెండ్ సబా ఆజాద్‌కు తీవ్ర అనారోగ్యం.. ఆసుపత్రిలో చికిత్స, అభిమానుల్లో ఆందోళన
Hrithik Roshan | బాలీవుడ్ సూపర్‌స్టార్ హృతిక్ రోషన్ ప్రియురాలు, నటి-సింగర్ సబా ఆజాద్ తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. దాదాపు రెండు వారాలుగా ఆసుపత్రి బెడ్‌పైనే చికిత్స తీసుకుంటున్న సబా, తన ఆరోగ్య పరిస్థితిపై సోషల్ మీడియాలో స్పందించారు. హాస్పిటల్లో ఉన్న ఫోటోను షేర్ చేస్తూ తనకు ఏమైంది అనే విషయాన్ని వెల్లడించారు. ‘సైక్లోస్పోరా కయెటానెన్సిస్’ అనే ప్రమాదకరమైన బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ కారణంగా తాను అనారోగ్యానికి గురైనట్లు తెలిపారు.
Hrithik Roshan | బాలీవుడ్ సూపర్‌స్టార్ హృతిక్ రోషన్ ప్రియురాలు, నటి-సింగర్ సబా ఆజాద్ తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. దాదాపు రెండు వారాలుగా ఆసుపత్రి బెడ్‌పైనే చికిత్స తీసుకుంటున్న సబా, తన ఆరోగ్య పరిస్థితిపై సోషల్ మీడియాలో స్పందించారు. హాస్పిటల్లో ఉన్న ఫోటోను షేర్ చేస్తూ తనకు ఏమైంది అనే విషయాన్ని వెల్లడించారు. ‘సైక్లోస్పోరా కయెటానెన్సిస్’ అనే ప్రమాదకరమైన బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ కారణంగా తాను అనారోగ్యానికి గురైనట్లు తెలిపారు. ఈ ఇన్ఫెక్షన్ శరీరంలోకి ప్రవేశిస్తే జీర్ణవ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేస్తుందని, గత 14 రోజులు తన జీవితంలో చాలా కష్టంగా గడిచాయని సబా పేర్కొన్నారు. ఎప్పుడూ ఇంటి ఆహారమే తీసుకుంటూ, బయటకు వెళ్లినప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకునే తనకు ఈ ఇన్ఫెక్షన్ ఎలా వచ్చిందో అర్థం కావడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
అనారోగ్యం కారణంగా కేవలం రెండు వారాల్లోనే నాలుగు కిలోల బరువు తగ్గిపోయానని, రోజూ వర్కౌట్స్ చేసే తనకు ఇప్పుడు నడవడమే కష్టంగా మారిందని తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలకు ముఖ్యమైన సూచనలు కూడా చేశారు. కూరగాయలు, ఆకుకూరలను వండే ముందు బాగా శుభ్రం చేయాలని, ముఖ్యంగా పచ్చిగా తినే ఆహారం విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. బేకింగ్ సోడాతో కూడా శుభ్రపరచడం మంచిదని పేర్కొన్నారు. ఈ కష్ట సమయంలో హృతిక్ రోషన్ తనకు అండగా నిలిచారని సబా భావోద్వేగంగా చెప్పారు. తనను నవ్విస్తూ, మానసికంగా బలంగా ఉండేలా ప్రోత్సహిస్తున్నారని తెలిపారు.
ఇక హృతిక్ రోషన్ సినీ ప్రయాణం విషయానికి వస్తే, 2000లో విడుదలైన కహో నా ప్యార్ హై సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి బాలీవుడ్లో స్టార్ హీరోగా ఎదిగారు. అనంతరం ‘కోయ్ మిల్ గయా’, ‘క్రిష్’ సిరీస్, ‘ధూమ్ 2’, ‘జోదా అక్బర్’, ‘వార్’, ‘ఫైటర్’ వంటి చిత్రాలతో తనదైన ముద్ర వేశారు. వ్యక్తిగతంగా ఆయన మొదట సుస్సానే ఖాన్ ను వివాహం చేసుకుని తర్వాత విడాకులు తీసుకున్నారు. అనంతరం సబా ఆజాద్‌తో రిలేషన్లో ఉన్నారు. సబా ఆరోగ్య పరిస్థితి వెలుగులోకి రావడంతో అభిమానులు, సినీ ప్రముఖులు ఆమె త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో సందేశాలు పంపుతున్నారు. ప్రస్తుతం ఈ విషయం బాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘బీఆర్ఎస్ నియోజకవర్గ ముఖ్యకార్యకర్తల సమావేశాన్ని జయప్రదం చేయండి’
women cops detain Dipke | అభిజిత్ దీప్కే బృందాన్ని అదుపులోకి తీసుకున్న మహిళా పోలీసులు.. వారినే ఎందుకు మోహరించారంటే?
గోల్డ్ మెడల్స్ సాధించిన మేఘన కాంతిప్రియకు సన్మానం
William O’Rourke | న్యూజిలాండ్‌కు మరో ఎదురుదెబ్బ.. భారత్‌తో వన్డే, టెస్టులకు స్టార్ పేసర్ దూరం..!
Aadi Saikumar | వైఫల్యాలు వస్తే కెరీర్ ముగిసినట్లా? నెటిజన్ పోస్ట్‌పై మండిపడ్డ ఆది సాయికుమార్!
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

