Hrithik Roshan | క్రిష్ 4 కోసం మెగా ఫోన్ పట్టబోతున్న హృతిక్ రోషన్..!
Hrithik Roshan | బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ నటించిన క్రిష్ సిరీస్ ఎంత పెద్ద హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు క్రిష్ 4కి సంబంధించిన పనులు ముమ్మరంగా సాగుతున్నాయి
Hrithik Roshan | బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ నటించిన క్రిష్ సిరీస్ ఎంత పెద్ద హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు క్రిష్ 4కి సంబంధించిన పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ సినిమాని గతం కన్నా మరింత ప్రతిష్టాత్మకంగా రూపొందించాలని అనుకుంటున్నట్టు రాకేష్ రోషన్ తెలిపారు. `కోయి మిల్ గయా`లో సందడి చేసిన జాదూ కూడా ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నట్లు హింట్ ఇచ్చారు. అలాగే `క్రిష్ -4` పూర్తిగా అంతరిక్షంలో జరిగే అద్భుతమని స్పష్టం చేసారు. అయితే ఈ ప్రాజెక్ట్ ని టేకప్ చేసే డైరెక్టర్ విషయంలో కొంత సస్పెన్స్ అయితే నెలకొంది.
రాకేష్ రోషన్ తెరకెక్కిస్తారా, లేకుంటే కొత్త దర్శకుడిని తెరపైకి తీసుకు వస్తారా అన్న సందేహం అందరి మదిలో మెదిలింది. ఈ క్రమంలో క్రిష్ 4 కోసం హీరోనే డైరెక్టర్ గా మారుతుడున్నాడు. హృతిక్ రోషన్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఆదిత్య చోప్రా-రాకేష్ రోషన్ -హృతిక్ రోషన్ ముగ్గురు డిస్కస్ చేసుకున్న అనంతరం హృతిక్ పేరును ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది. ఇప్పుడు ఈ వార్త బాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. గతంలో ఎప్పుడు కూడా హృతిక్ రోషన్ డైరెక్టర్‌గా ఒక్క సినిమాని కూడా తెరకెక్కించింది లేదు.
సొంత ప్రొడక్షన్ హౌస్ లో వివిధ చిత్రాలకు వివిధ విభాగాల్లో పని చేసిన అనుభవం మాత్రమే అతనికి ఉంది. అయితే క్రిష్ ఫ్రాంచైజీలో నటించిన అనుభవంతోనే డైరెక్టర్‌గా అడుగులు వేసేందుకు హృతిక్ సిద్ధమయ్యాడనే టాక్ వినిపిస్తుంది. ఒకేసారి హీరోగా…డైరెక్టర్ గా పనిచేయడం అన్నది కత్తి మీద సాము. అంతేకాకుండా సూపర్ హీరో చిత్రాలు తెరకెక్కిచడం అంటే మరింత సవాల్ గా మారుతుంది. మరి దీనిని హృతిక్ రోషన్ ఎలా డీల్ చేస్తాడో చూడాలి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI | భారత్‌తో మూడో టీ20.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
Pakistan | పాకిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.. పీటీఐ ప్రభుత్వం రద్దు.. సీఎం అరెస్ట్
Agriculture Admissions | వ్యవసాయ కోర్సుల్లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్.. ఈ నెల 14 నుంచి ప్రారంభం
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
MLC Dasoju Shravan Kumar | ఈ ప్రభుత్వానికి ఎంప్లాయింట్ పాలసీనే లేదు : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

