Hrithik Roshan | ఆఫీసు కోసం ఏకంగా ₹28 కోట్ల భారీ పెట్టుబడి.. హాట్ టాపిక్‌గా హృతిక్ కమర్షియల్ ఆస్తి కొనుగోలు
Hrithik Roshan | బాలీవుడ్ స్టార్లు ఆస్తుల కొనుగోలు,అమ్మకాల ద్వారా సంపదను విస్తరించుకోవడం కొత్తేమీ కాదు. అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్, హృతిక్ రోషన్ వంటి పలువురు సెలెబ్రిటీలు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో చురుకుగా ఉంటారు.
Hrithik Roshan | బాలీవుడ్ స్టార్లు ఆస్తుల కొనుగోలు,అమ్మకాల ద్వారా సంపదను విస్తరించుకోవడం కొత్తేమీ కాదు. అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్, హృతిక్ రోషన్ వంటి పలువురు సెలెబ్రిటీలు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో చురుకుగా ఉంటారు. తాజాగా హృతిక్ రోషన్ ఫ్యామిలీ మరోసారి తెలివైన పెట్టుబడి పెట్టినట్లు సమాచారం బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ జుహులోని గ్రేడ్ A కమర్షియల్ కంప్లెక్స్ యురా (Eura)లో రూ. 28 కోట్లు విలువైన ప్రీమియం వాణిజ్య ఆస్తిని కొనుగోలు చేశారు. ఈ ఆస్తి HRX Digitech LLP – FilmKunj (Bombay) LLP పేరుతో రిజిస్టర్ చేయబడింది.
ప్రాజెక్ట్ వింగ్–Cలోని రెండు అంతస్తులను కలిపి దాదాపు 7,000 చదరపు అడుగులు విస్తీర్ణంలో ఈ కొత్త ఆఫీస్ ఉంది. నాలుగు అంతస్తుల ఈ బ్లాక్‌లో ఒక అంతస్తు కుటుంబ అవసరాల కోసం ప్రత్యేకంగా కేటాయించబడినట్లు తెలుస్తోంది. యురా కంప్లెక్స్ ప్రస్తుతం జుహులో అత్యధిక డిమాండ్ ఉన్న వాణిజ్య కేంద్రాల్లో ఒకటి.హృతిక్ రోషన్ నివాసం, ఆయన తండ్రి రాకేష్ రోషన్ ఇంటి మధ్యలో ఉండటం కారణంగా ఈ ఆఫీస్ లొకేషన్ వారికి అనుకూలంగా మారింది.ఇంటి నుండి ఆఫీస్‌కు తక్కువ దూరం, జెన్-Z బిజినెస్ స్టైల్‌కి అనుగుణమైన ఆఫీస్ స్పేస్, కేఫ్‌లు, రెస్టారెంట్ ఏరియాలు అందుబాటులో ఉండటం, బలమైన రోడ్ & రైల్ కనెక్టివిటీ ప్రత్యేక ఆకర్షణ.
మెట్రో లైన్-1, మెట్రో లైన్-2A, రాబోయే లైన్-2B, కోస్టల్ రోడ్ సీ-లింక్, వెస్ట్రన్ ఎక్స్‌ప్రెస్ హైవే ఈ కనెక్టివిటీ అద్దెదారులకు, సందర్శకులకు మరింత సౌకర్యాన్ని అందిస్తోంది. ఇక కెరీర్ విషయానికి వస్తే వార్ 2 చిత్రంతో నిరాశపరిచిన హృతిక్ రోషన్ మళ్లీ కెరీర్ పునరాగమనాన్ని ఆశిస్తున్నాడు. ప్రస్తుతం తాను స్వీయ దర్శకత్వంలో తెరపైకి రాబోతున్న ‘క్రిష్ 4’ చిత్రానికి సిద్ధమవుతున్నాడు. ఇందులో హృతిక్ హీరోగా నటించనున్నాడు. ఏదేమైన రియల్ ఎస్టేట్‌లో వరుస పెట్టుబడులు పెడుతున్న హృతిక్–రాకేష్ రోషన్ ద్వయం మరోసారి తమ తెలివైన ఫైనాన్షియల్ ప్లానింగ్‌ను నిరూపించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI | భారత్‌తో మూడో టీ20.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
Pakistan | పాకిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.. పీటీఐ ప్రభుత్వం రద్దు.. సీఎం అరెస్ట్
Agriculture Admissions | వ్యవసాయ కోర్సుల్లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్.. ఈ నెల 14 నుంచి ప్రారంభం
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
MLC Dasoju Shravan Kumar | ఈ ప్రభుత్వానికి ఎంప్లాయింట్ పాలసీనే లేదు : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

