aadi sai kumar | ఆది సాయికుమార్ అన్ని సినిమాలు ఎలా చేస్తున్నాడు.. బిజినెస్ ఎలా వర్కౌట్ అవుతుంది..?
యూ ట్యూబ్ లో ఆది సాయికుమార్ హిందీ డబ్బింగ్ సినిమాలకు అదిరిపోయే డిమాండ్ ఉంది. అతడి సినిమాలకు వందల మిలియన్ల వ్యూస్ వస్తున్నాయి. ఇలా ఎలా చూసుకున్నా కూడా.. సినిమా మీద నిర్మాతలు పెట్టిన బడ్జెట్ విడుదలకు ముందే వర్కౌట్ అవుతుంది.
aadi sai kumar | హిట్టు ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో బిజీగా ఉండే అతి తక్కువ మంది చిన్న హీరోలలో.. ఆది సాయికుమార్ అందరి కంటే ముందు వరుసలో ఉంటాడు. కనీసం చేతిలో ఎప్పుడూ అరడజన్ సినిమాలతో ఉంటాడు ఆది. ఈయన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేసి చాలా కాలం అయింది. తొలి సినిమా ప్రేమ కావాలితో మంచి విజయం అందుకున్న అది ఆ తర్వాత లవ్లీతో మరో హిట్ కొట్టాడు. ఆ తర్వాత ఇప్పటి వరకు దాదాపు 15 సినిమాలు చేసిన ఆది సాయికుమార్.. అందులో ఏ ఒక్కదానితో కూడా బాక్సాఫీస్ దగ్గర మాయ చేసింది లేదు.
మధ్యలో కొన్ని యావరేజ్ సినిమాలు వచ్చాయి.. కానీ అవి పెద్ద హిట్ మాత్రం కాదు. అయినా కూడా ఆదితో సినిమాలు చేయడానికి నిర్మాతలు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు. దీని వెనక లాజిక్ ఏంటో తెలియక చాలా మంది హీరోలకు పిచ్చి ఎక్కిపోతుంటుంది. ఈ ఏడాది ఇప్పటికే బ్లాక్, తీస్ మార్ ఖాన్, అతిథి దేవోభవ, క్రేజీ ఫెలో లాంటి సినిమాలతో వచ్చాడు ఆది. ఈయనకు ఇన్ని అవకాశాలు ఎలా వస్తున్నాయి అని లెక్కలు వేసుకుంటే.. దాని వెనుక ఉన్న లాజిక్స్ చాలా ఆసక్తికరంగా ఉంటాయి.
ఆది సాయికుమార్ తో సినిమా చేయాలంటే కనీసం రెండు కోట్ల బడ్జెట్ ఉంటే సరిపోతుంది. అతడితో సినిమా చూసే ఏ దర్శకుడైన కూడా పక్కా కమర్షియల్ ఫార్మేట్ లో చేస్తుంటాడు. ఆది ప్రతి సినిమాను అమెజాన్ ప్రైమ్ వీడియో మంచి రేటు ఇచ్చి కొనుక్కుంటుంది. అతడి చాలా సినిమాలు అమెజాన్ ప్రైమ్ లో కనీసం కోటి రూపాయల కంటే ఎక్కువ బిజినెస్ చేశాయి. ఇదిలా ఉంటే హిందీ మార్కెట్ ఆదికి చాలా ప్లస్ అవుతుంది. మన దగ్గర ఇమేజ్ ఎలా ఉన్నా కూడా హిందీలో మాత్రం ఆది సినిమాలకు డిమాండ్ చాలా ఉంది. అక్కడ ఈయన ఒక్కో సినిమా 2.5 నుంచి 3 కోట్ల వరకు అమ్ముడు అవుతుంది అంటే ఆశ్చర్యపోక తప్పదు.
యూ ట్యూబ్ లో ఆది సాయికుమార్ హిందీ డబ్బింగ్ సినిమాలకు అదిరిపోయే డిమాండ్ ఉంది. అతడి సినిమాలకు వందల మిలియన్ల వ్యూస్ వస్తున్నాయి. ఇలా ఎలా చూసుకున్నా కూడా.. సినిమా మీద నిర్మాతలు పెట్టిన బడ్జెట్ విడుదలకు ముందే వర్కౌట్ అవుతుంది. అందుకే ఆయన సినిమాలు థియేటర్స్ లో పెద్దగా వర్కౌట్ అవ్వకపోయినా.. శాటిలైట్, ఓటిటి, డిజిటల్ రైట్స్, హిందీ డబ్బింగ్ రైట్స్ రూపంలో నిర్మాతలు బయటపడిపోతున్నారు. మిగిలిన ఏ హీరోలకు లేని అడ్వాంటేజ్ ఆదికి ఉంది కాబట్టే వీలైనంత తక్కువ బడ్జెట్ లో ఇతడితో సినిమాలు చేసి లాభాలు తెచ్చుకుంటున్నారు నిర్మాతలు.
ఇవి కూడా చదవండి..
ఆత్మను వదిలేసిన సుకుమార్.. రెమ్యునరేషన్ ప్రధాన కారణమా..?
‘లైగర్’ తర్వాత మార్పు.. బ్లాక్ బస్టర్ డైరెక్టర్‌కు నో చెప్పిన విజయ్..!
Karthi | మెగాఫోన్ పట్టనున్న కార్తి.. తొలి సినిమా ఆ స్టార్ హీరోతోనేనట..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Roller | పాలపిట్టను విడుదల చేసిన ఘటనపై కేసు నమోదు
World Cup | ఇండియాలో వరల్డ్ కప్ టోర్నీకి పాకిస్తాన్ దూరం.. జట్టు పర్యటనకు అనుతివ్వని పీసీబీ
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Muskan Rastogi | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. జైలులోనే నిందితురాలు, 10 నెలల కూతురు.. చిన్నారి దత్తత కోరుతూ పిటిషన్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

