ఆత్మను వదిలేసిన సుకుమార్.. రెమ్యునరేషన్ ప్రధాన కారణమా..?
Sukumar | ఇండస్ట్రీలో కొందరు దర్శకుల సినిమాలకు టెక్నీషియన్స్ ముందు నుంచే ఫిక్స్ అయిపోయి ఉంటారు. ఉదాహరణకు రాజమౌళి సినిమా చేస్తుంటే సంగీత దర్శకుడు ఎవరు అని అడగాల్సిన అవసరం లేదు.. అలాగే సుకుమార్ ఓ సినిమా చేస్తున్నారంటే ఆయన టెక్నీషియన్స్ కూడా సపరేట్గా ఉంటారు.
Sukumar | ఇండస్ట్రీలో కొందరు దర్శకుల సినిమాలకు టెక్నీషియన్స్ ముందు నుంచే ఫిక్స్ అయిపోయి ఉంటారు. ఉదాహరణకు రాజమౌళి సినిమా చేస్తుంటే సంగీత దర్శకుడు ఎవరు అని అడగాల్సిన అవసరం లేదు.. అలాగే సుకుమార్ ఓ సినిమా చేస్తున్నారంటే ఆయన టెక్నీషియన్స్ కూడా సపరేట్గా ఉంటారు. మరీ ముఖ్యంగా సుక్కు సినిమాకు సంగీతం ఎవరు అందిస్తున్నారు అని ప్రత్యేకంగా కనుక్కోవలసిన పనిలేదు. ఎందుకంటే వాళ్లు కొందరితో సింక్ అయిపోయి ఉంటారు. వాళ్ళు ఏ సినిమా చేసినా కూడా కచ్చితంగా వాళ్లతో పాటు సదరు టెక్నీషియన్స్ కూడా ఆ సినిమాకు పని చేస్తారు. కాకపోతే సుకుమార్ తొలిసారి తన ఆత్మను పక్కనపెట్టి పని చేస్తున్నాడు. ఆయన సినిమాకు ఆత్మ అంటే ఎవరు అందరికీ తెలుసు.. ఆ ఆత్మ పేరు దేవి శ్రీ ప్రసాద్.
ఇండస్ట్రీకి ఎంతమంది కొత్త సంగీత దర్శకులు వచ్చినా కూడా సుకుమార్.. దేవిని కాదని మరొకరి దగ్గరికి వెళ్ళడు. అలాగే మిగిలిన దర్శకులకు ఎలాంటి సంగీతం అందించినా.. సుకుమార్ సినిమాలకు మాత్రం పగిలిపోయే మ్యూజిక్ ఇస్తాడు దేవి. ఇద్దరి బాండింగ్ 20 సంవత్సరాలుగా అలాగే సాగుతుంది. అయితే మొదటి సారి తన సినిమాకు దేవిని పక్కనపెట్టి కన్నడ సంగీత సంచలనం అజనీష్ లోకనాథ్ను తీసుకున్నాడు సుకుమార్. కేవలం దర్శకుడుగానే కాకుండా నిర్మాతగా కూడా బిజీగా ఉన్నాడు లెక్కల మాస్టారు. ఈయన నిర్మాణంలో సాయి ధరమ్ తేజ్ హీరోగా కార్తీక్ దండు దర్శకత్వంలో ఒక సినిమా వస్తుంది. దీనికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు సుకుమార్ అందిస్తున్నాడు. అలాగే నిర్మాత కూడా ఆయనే.
సీనియర్ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ తో కలిసి ఈ సినిమాను సుకుమార్ నిర్మిస్తున్నాడు. ఇదిలా ఉంటే ఈ సినిమాకు ముందు దేవి శ్రీ ప్రసాద్ ను సంగీత దర్శకుడిగా ఎంచుకున్నారు. తను దర్శకత్వం వహించే సినిమాలకు మాత్రమే కాదు.. సుకుమార్ నిర్మించిన ‘కుమారి 21ఎఫ్’, ‘ఉప్పెన’ లాంటి సినిమాలకు కూడా దేవినే సంగీతమందించాడు. అయితే ఇప్పుడు ఆయన స్థానంలో కన్నడ సంగీత దర్శకుడు అజనీష్ వచ్చి చేరాడు. ఈ మధ్య ‘విక్రాంత్ రోణా’, ‘కాంతార’ సినిమాతో ఈయన పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోతుంది. సాయి ధరమ్ తేజ్ సినిమా నుంచి డీఎస్పీని తప్పించడానికి పారితోషకమే కారణమని తెలుస్తుంది.
మీడియం బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంగీతం అందించడానికి ఏకంగా 3 కోట్లు డిమాండ్ చేయడంతో.. మరో ఆప్షన్ లేక అజనీష్ వైపు సుకుమార్ అడుగులు వేశాడని తెలుస్తోంది. మొత్తానికి కారణమేదైనా కూడా దేవిని కాదని తొలిసారి బయట సంగీత దర్శకుడుతో పని చేస్తున్నాడు సుకుమార్. ఐదేళ్ల కింద తన బంధువును హీరోగా పరిచయం చేస్తూ చేసిన దర్శకుడు సినిమా కోసం సాయి కార్తీక్ సంగీతం అందించాడు. అయితే అది చిన్న సినిమా కావడంతో ఎవరు పెద్దగా పట్టించుకోలేదు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

