కుటుంబంలో అల్లుకున్న బంధాలు, జ్ఞాపకాల నేపథ్యంలో సాగే వెబ్ సిరీస్ ‘హోం టౌన్’. రాజీవ్ కనకాల, ఝాన్సీ, యాని, ప్రజ్వల్, సైరమ్, అనిరుధ్, జ్యోతి కీలక పాత్రధారులు. శ్రీకాంత్‌రెడ్డి పల్లే దర్శకుడు. నవీన్ మేడారం, శేఖర్ మేడారం నిర్మాతలు. రేపటి నుంచి ఆహా ఓటీటీలో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. రాజీవ్ కనకాల అభినయం సిరీస్‌లో హైలైట్‌గా నిలుస్తుందని, కథ, కథనాలు కొత్తగా ఉంటాయని మేకర్స్ చెబుతున్నారు. ఈ సిరీస్‌కి కెమెరా: దేవ్ దీప్ గాంధీ కుండు, సంగీతం: సురేష్ బొబ్బిలి.