Holi Special | టాలీవుడ్ హోలీ సాంగ్స్.. రంగుల పండుగ అంటే ఈ పాటలు వినాల్సిందే!
Holi Special | నింగినున్న హరివిల్లు ఇలకు చేరే సందర్భం హోలీ! ఈ రంగుల పండుగ ఉరిమే ఉత్సాహాన్ని తెస్తుంది. రాబోయే వసంత సంతసానికి స్వాగత గీతం పాడుతుంది.
Holi Special | నింగినున్న హరివిల్లు ఇలకు చేరే సందర్భం హోలీ! ఈ రంగుల పండుగ ఉరిమే ఉత్సాహాన్ని తెస్తుంది. రాబోయే వసంత సంతసానికి స్వాగత గీతం పాడుతుంది. అందుకే కాబోలు.. హోలీ అంటే సినీ జనాలకూ ఇష్టమే! చాలా సినిమాల్లో హోలీ కేళీ ఆధారంగా ఒక సన్నివేశమో, రంగు రంగుల గీతమో ఉండేలా ప్లాన్ చేస్తుంటారు. వీటిలో పండుగ వైభవాన్ని చాటే పాటలు కొన్ని ఉంటాయి. అంతేకాదు, హీరోయిజాన్ని చాటిచెప్పే సాంగ్ అయినా, కథానాయిక సొగసులను వర్ణించే సందర్భమైనా.. సినీకవులు రంగులన్నీ రంగరించి అందమైన పాటగా ప్రేక్షకులపై కుమ్మరిస్తారు.

సినిమా పాటల్లో పండుగలు తొంగి చూడటం బ్లాక్ అండ్ వైట్ రోజుల నుంచీ ఉన్నదే! ఈ స్పెషల్ గీతాల్లో దీపావళి, సంక్రాంతి పండుగలదే అగ్రభాగం. ఆ తర్వాతి స్థానాన్ని ఆక్రమించింది హోలీనే! టాలీవుడ్లో కన్నా బాలీవుడ్ గీతాల్లో హోలీ కేళీ ఎక్కువగా కనిపిస్తుంది. ఫక్తు హోలీ పాటలకన్నా రంగులద్దుకున్న పాటలెన్నో ఉన్నాయి. వన్నెచిన్నెల చెలిని పంచెవన్నెల చిలుకగా పోలుస్తూ గీత రచయితలు ప్రదర్శించే పాటవం, అందమైన పాటలుగా మనల్ని అలరిస్తుంటాయి. ‘పచ్చందనమే పచ్చదనమే..’ అని సాగే వేటూరి గీతం.. నీలాంబరాన దాగున్న కథానాయిక సౌందర్యాన్ని వర్ణించిన వైనం అద్భుతం. ప్రకృతిలో దాగున్న వర్ణాల వైభవాన్నంతా ‘సఖీ’ సినిమాలోని ఈ పాటలో ఏకరువు పెట్టేశారు సుందరరామ్మూర్తి. ‘రవివర్మకే అందనీ ఒకే ఒక అందానివో..’ పాటలో ‘ఏ గగనమో కురుల జారి నీలిమై పోయె..’ అని ముక్తాయింపు కలర్ఫుల్గా ఉంటుంది!

పక్కా హోలీ పాటలకొస్తే… ఈ రంగుల పండుగనాడు వీధివీధిలో మార్మోగే పాట ‘సందెపొద్దు మేఘం పూలజల్లు కురిసెను నేడు’. ‘నాయకుడు’ సినిమాలోని ఈ గీతం వినసొంపుగా ఉంటుంది. రంగుల పండుగ సందడితో చూడ ముచ్చటగా సాగుతుంది. ‘మా సొంతం.. ఈ ఆనందం’ అని రంగులు ఆడుకోవడానికి వీధిలోకి పరిగెత్తేలా చేస్తుంది. ‘చక్రం’ సినిమాలోని ‘రంగేలీ హోలీ.. హంగామా కేళీ.. ఎక్కడ నువ్వుంటే అక్కడ జరగాలి..’ పాట హోలీ సందడితోపాటు సిరివెన్నెల మార్కు సందేశాన్ని పంచుతుంది. నాగార్జున హీరోగా వచ్చిన ‘మాస్’లో హోలీ పాట సూపర్ హిట్. ‘కొట్టు కొట్టు కొట్టు.. రంగుదీసి కొట్టు..’ అని మొదలయ్యే గీతం ‘రంగులోనే లైఫ్ ఉంది’ అని చాటిచెబుతుంది.
‘మహానగరం’ చిత్రంలోని ‘హరివిల్లే వరదల్లే ఇలపైకి దిగివచ్చేనమ్మా..’ పాట, ఈ రంగుల పండుగ ఎంతటి సంతోషాన్ని మోసుకొస్తుందో అభి‘వర్ణి’స్తుంది. వెంకటేశ్ హీరోగా నటించిన ‘జెమిని’ చిత్రంలో ‘దిల్ దివానా.. మై హసీనా..’ పాట నేపథ్యం హోలీ పండుగే! ‘జెమిని’ టైటిల్ సాంగ్ హోలీ నాడు సంప్రదాయంగా తాగే బంగు ప్రభావంతో మొదలయ్యేదే! ‘హోలీ రంగ హోలీ.. కేళీ చెమ్మకేళీ.. ఖుషీ జల్లుకోవాలి.. పోసుకున్నా రంగులే పూసలవ్వాలి’ ప్రత్యేక గీతంలో హీరో విజయ్ దేవరకొండ చేసిన సందడి కలర్ ఫెస్టివల్ సంతోషాన్ని రెట్టింపు చేసేలా ఉంటుంది.
‘క్రేజీ క్రేజీ ఫీలింగ్’ సినిమాలోని ‘ఏడాదికోసారి వచ్చే హోలీ.. జిందగీలో తెచ్చింది ఫుల్ రంగేలీ’ పాట ఉల్లాస భరితంగా సాగుతుంది. ‘హోలీ’ పండుగ సన్నివేశాలకూ సినిమాల్లో కొదువ ఉండదు. ‘ఇంద్ర’ సినిమాలో జడివాన జాడతో నేలంతా పులకించిన తర్వాత వచ్చే హోలీ సందడి సినిమా కథను ఊహించని మలుపు తిప్పుతుంది. ఈ సినిమా విడుదలయ్యాక.. ఒక సన్నివేశంలో లోపం ఉందనీ, దాన్ని చెప్పిన వారికి ప్రైజ్‌మనీ ఇస్తామనీ చిత్రబృందం ప్రకటించింది. అయితే, చాలామంది రకరకాల లోటుపాట్లు అనుకున్నారు. కానీ, ఆ సినిమాలో చిరంజీవి పాత్రకు అక్కలు రాఖీ కడతారు. అయితే, అంతకు ముందు సీన్లోనే హీరో కుటుంబం హోలీ సెలబ్రేట్ చేసుకోవడమే అసలు లోపమని చిత్ర బృందం ప్రకటించడం గమ్మత్తు! ఇక ఉదయ్‌కిరణ్ హీరోగా వచ్చిన ‘హోలీ’ సినిమా మంచి విజయాన్నే సొంతం చేసుకుంది. చివరిగా, ఈ రంగుల హోలీని పాటల కేళీగా జరుపుకొంటే.. మన జిందగీకి కొత్త హంగులు వచ్చి చేరినట్టే!!
బాలీవుడ్ హోలీ హిట్ సాంగ్స్
- రంగ్ బర్సే భీగీ చునర్ వాలీ- సిల్సిలా
- హోలీ కే దిన్- షోలే
- బాలమ్ పిచ్కారీ- యే జవానీ హై దివానీ
- ఆజ్ నా చోడేంగే- కాటీ పతంగ్
- అంగ్ సే అంగ్ లగానా- డర్
- జై జై శివశంకర్ కాంటా లగే నా కంకర్- ఆప్ కీ కసమ్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gen Z Protests | జర్మనీలో జెన్‌జీ ఆగ్రహజ్వాలలు.. 34 నగరాల్లో నిరసనలు.. ఫ్రాంక్‌ఫర్ట్‌లో లూటీలు!
Gratuity Calculator | ఉద్యోగం మానేస్తున్నారా? మీకు రావాల్సిన గ్రాట్యుటీ ఎంతో ఇలా లెక్కించండి
Endowments | దేవాదాయ శాఖలో అతనొక్కడే.. అన్ని విషయాల్లో అంతా తానే అయిన ఆ శాఖ సలహాదారు!
Hyderabad Metro | మెట్రో రైలు టేకోవర్‌పై నీలినీడలు.. నిధుల సమీకరణలో వైఫల్యం.. అప్పుల కోసం అగచాట్లు
Raj Gopal Reddy | పైసలివ్వనిదే ఫైలు కదుల్తలేదు.. పంచాయతీ సెక్రటరీ నుంచి సీఎస్ వరకు ఇదే దుస్థితి: రాజగోపాల్‌రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

