Hidimbha Movie Shoot wrapped | ‘రాజు గారి గది’ సిరీస్‌తో టాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ హీరో అశ్విన్. ప్రముఖ యాంకర్,డైరెక్టర్ ఓంకార్ తమ్ముడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే గత కొంత కాలంగా ఈయన నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోతున్నాయి. ఫలితం ఎలా ఉన్న అశ్విన్ మాత్రం వరుసగా సినిమాలను చేస్తున్నాడు. ప్రస్తుతం హిడింబ అనే యాక్షన్ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి అనీల్ కన్నెగంటి దర్శకత్వం వహించాడు. ఇప్పటికే చిత్రం నుండి రిలీజైన పోస్టర్లు, గ్లింప్స్ సినిమాపై మంచి అంచనాలు నెలకొల్పాయి.
తాజాగా చిత్రబృందం బిగ్ అప్డేట్ ప్రకటించింది. హిడింబ షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు. అంతేకాకుండా త్వరలోనే ఈ సినిమా ట్రైలర్ అప్డేట్ను వెల్లడించనున్నట్లు చిత్ర బృంద తెలిపింది. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని శ్రీవిఘ్నేష్ సినిమాస్ బ్యానర్‌పై గంగపట్నం శ్రీధర్ నిర్మించాడు. అశ్విన్‌కు జోడీగా నందితా శ్వేత హీరోయిన్గా నటించింది. వికాస్ బడిసా సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి రాజశేఖర్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు.
The Hard hitting Action Entertainer #HIDIMBHA SHOOT COMPLETED 💥💥
Power Packed Trailer Loading.. 🔥 ⌛
A film by @aneelkanneganti 🎬 @imashwinbabu #GangapatnamSridhar #SVKCinemas @Nanditasweta @DopRajasekarB @vikasbadisa @ramjowrites #OAK pic.twitter.com/PbI1D7gcX9
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) November 13, 2022