Hi Nanna | టాలీవుడ్ న్యాచురల్ స్టార్ నాని (Nani) నటిస్తున్న తాజా చిత్రం హాయ్ నాన్న (Hi Nanna). నాని 30 (Nani 30)గా తెరకెక్కుతున్న ఈ సినిమాతో శౌర్యువ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. టాలీవుడ్ భామ, సీతారామం ఫేం మృణాళ్ ఠాకూర్ ఈ హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లింప్స్‌తో పాటు ఫస్ట్ సింగిల్, సెకండ్ సింగిల్‌లను లాంఛ్ చేయగా.. ప్రేక్షకుల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ మూవీ నుంచి మేకర్స్ థర్డ్ సింగిల్ వదలనున్నట్లు తెలిపారు.
ఈ మూవీలోని థర్డ్ సింగిల్ అమ్మాడి (Ammadi) సాంగ్‌ను నవంబర్ 04న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం సోషల్ మీడియాలో రాసుకోచ్చింది. ఇక ఈ పాటను తెలుగులోనే కాకుండా మలయాళం, హిందీ, కన్నడ, తమిళం భాషల్లో రిలీజ్ చేయనున్నారు.
Blissful melody #Ammaadi is ready to steal your heart from November 4th ❤️🔥#Maiyal #Andhaaju #MelleIshtam #PyaraLaage#HiNanna #HiNannaOnDec7th #HiPapa #HiPapaOnDec7th
Natural 🌟 @NameIsNani @Mrunal0801 @shouryuv #BabyKiara @HeshamAWMusic @SJVarughese @artkolla @mohan8998… pic.twitter.com/xDRGnmqBLY
— Vamsi Kaka (@vamsikaka) October 30, 2023
ఈ మూవీలో నాని కూతురి పాత్రలో బేబి కైరా ఖన్నా నటిస్తోంది. ఈ చిత్రాన్ని వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై మోహన్ చెరుకూరి (CVM), డాక్టర్ విజేందర్ రెడ్డి తీగల, మూర్తి కేఎస్ తెరకెక్కిస్తున్నారు.
ఈ సినిమాకు మలయాళ కంపోజర్, హృదయం, ఖుషీ చిత్రాల ఫేం హెశమ్ అబ్దుల్ వహబ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీకి ప్రవీణ్ ఆంటోనీ ఎడిటర్ కాగా.. జోతిష్ శంకర్ ప్రొడక్షన్ డిజైనర్‌గా వర్క్ చేస్తున్నాడు.