Heroines | టాలీవుడ్ సీనియర్ హీరోయిన్స్ త్రిష, ఛార్మీ, నికిషా పటేల్ ఒకే ఫ్రేమ్‌లో కనిపించి అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చారు. దుబాయ్‌లోని బ్లూవాటర్ ఐలాండ్ వేదికగా ఈ ముగ్గురు రీయూనియన్ జరుపుకున్నట్లు తెలుస్తోంది. ఈ రీయూనియన్‌కు సంబంధించిన ఫోటోలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. దాదాపు 20 ఏళ్లుగా సినిమా రంగంలో కొనసాగుతున్న ఈ ముగ్గురు ఇప్పటికీ ఏమాత్రం తగ్గని అందంతో కుర్ర హీరోయిన్లకు సైతం పోటీ ఇస్తుండటం ప్రత్యేక ఆకర్షణగా మారింది.త్రిష, ఛార్మీ ఇద్దరి మధ్య ఉన్న స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు రెండు దశాబ్దాల క్రితం విడుదలైన పౌర్ణమి సినిమాలో వీరిద్దరూ అక్కాచెల్లెళ్లుగా నటించారు.
ఆ సినిమా నుంచి మొదలైన స్నేహాన్ని గుర్తు చేసుకుంటూ, ఇప్పుడు దుబాయ్ ట్రిప్‌లోనూ ఒకరిపై ఒకరు ప్రేమను కురిపించుకున్న ఫోటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఒక ఫోటోలో త్రిష, ఛార్మీకి ముద్దు పెడుతూ కనిపించగా, మరికొన్ని ఫోటోలలో ముగ్గురు నవ్వుతూ సరదాగా గడిపిన క్షణాలు కనిపించాయి. ఛార్మీ ఈ ఫోటోలకు “ఈ అమ్మాయిలకు నేను అడిక్ట్ అయ్యాను” అంటూ క్యాప్షన్ ఇవ్వగా, నికిషా “బ్లూవాటర్ ఐలాండ్‌లో గర్ల్స్ ట్రిప్ రీయూనియన్” అంటూ తన ఆనందాన్ని షేర్ చేసింది. పౌర్ణమి తర్వాత త్రిష టాప్ హీరోయిన్గా వరుస విజయాలతో దూసుకెళ్లగా, ఛార్మీ తనదైన శైలిలో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. కాలక్రమంలో ఛార్మీ నటనతో పాటు నిర్మాణ రంగంలోనూ సెటిల్ అయింది. ప్రస్తుతం త్రిష మాత్రం తమిళం, తెలుగు భాషల్లో వరుస సినిమాలతో బిజీగా ఉంది.
ఇక నికిషా పటేల్ విషయానికి వస్తే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన కొమురం పులి సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఆ తర్వాత సినిమాలకు దూరమైనప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం నికిషా చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఇప్పుడు ఈ ముగ్గురు కలిసి దుబాయ్ వేదికగా రీయూనియన్ పార్టీ జరుపుకోవడం టాలీవుడ్ అభిమానులకు నాస్టాల్జిక్ ఫీల్ కలిగిస్తోంది. సంవత్సరాలు గడిచినా వీరి మధ్య స్నేహం అలాగే కొనసాగుతుండటం చూసి ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ రీయూనియన్ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్‌గా మారగా, మరోసారి ఈ ముగ్గురిని కలిసి వెండితెరపై చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు.