Shweta Lakshman | సినిమా నచ్చకపోతే అమీర్‌పేట్‌లో గుండు కొట్టించుకుంటా.. హీరోయిన్ ఛాలెంజ్!
SAHAA | టాలీవుడ్లో సరికొత్త ప్రేమకథా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘సహ (లైఫ్ ఆఫ్ సంజు)’ (SAHAA Life of Sanju) ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.
SAHAA | టాలీవుడ్లో సరికొత్త ప్రేమకథా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘సహ (లైఫ్ ఆఫ్ సంజు)’ (SAHAA Life of Sanju) ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. యువ నటులు శివ కుమార్ కాసారం, శ్వేతా లక్ష్మణ్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి నిశాంత్ దోటి దర్శకత్వం వహించగా, తేజేశ్వర్ వేల్పుచర్ల నిర్మించారు. వ్రజన పాండ్య, మహిపాల్, సునీల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబరు 4న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది.
ఈ నేపథ్యంలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో హీరోయిన్ శ్వేతా లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షించాయి. సినిమాపై ఉన్న నమ్మకంతో ఆమె మాట్లాడుతూ.. “నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేయట్లేదు, ఛాలెంజ్ చేస్తున్నాను. సినిమా చూశాక మీరందరూ ఒక గొప్ప సినిమా చూశామే అనే సంతృప్తితోనే బయటికి వస్తారు తప్ప నిరాశతో రారు. ఒకవేళ ఈ సినిమా మీకు నచ్చకపోతే నేను అమీర్‌పేట్ సెంటర్లో నిలబడి గుండు కొట్టించుకుంటాను” అంటూ సంచలన ప్రకటన చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరోవైపు ఈ చిత్రంలో నటించిన హీరో శివ కుమార్ కూడా సినిమా నచ్చకపోతే నా నంబర్‌కి చేసి తిట్టండంటూ బోల్డ్ కామెంట్ చేశాడు.
సంజు అనే యువకుడి జీవిత ప్రయాణం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో తొలిప్రేమ, బ్రేకప్ బాధ, మధుర జ్ఞాపకాలు, దైనందిన జీవిత సవాళ్లను అత్యంత సహజంగా ఆవిష్కరించారు. ఇది ప్రతి ఒక్కరి మనసుకు హత్తుకునే ఎమోషనల్ జర్నీగా నిలుస్తుందని చిత్ర బృందం చెబుతోంది. ప్రముఖ నిర్మాతలు బన్నీ వాసు, వంశీ నందిపాటి ఈ సినిమాను సంయుక్తంగా విడుదల చేస్తుండటంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
Actress #SwethaLakshman’s BOLDEST & SHOCKING STATEMENT about her upcoming film #Sahaa :
“ఈ సినిమా చూసి మీరు DISAPPOINT అయితే,
నేను AMEERPET CENTERలో నుంచుని గుండు గీసుకుంటా…!!” 😳😬 pic.twitter.com/C2gunMgejt— Rangasthalam (@RangasthalamIN) August 27, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

