పార్థగోపాల్ నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం ‘డైమండ్ డెకాయిట్’. మేఘన కథానాయిక. కుటుంబ భావోద్వేగాలతో కూడిన ఈ ప్రతీకార కథాంశానికి సూర్య జి.యాదవ్ దర్శకుడు. ఏప్రిల్‌లో సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా పాటలను దర్శకుడు వీఎన్ ఆదిత్య హైదరాబాద్‌లో విడుదల చేశారు.
పాటలు ఆకట్టుకునేలా ఉన్నాయని, కొత్త కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ చిత్రం ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందని వీఎన్ ఆదిత్య నమ్మకం వెలిబుచ్చారు. ఆకట్టుకునే కథా, కథనాలతో ఈ సినిమా ఉంటుందని, సంగీతం ఈ సినిమాకు ప్రధాన బలమని దర్శకుడు సూర్య జి.యాదవ్ తెలిపారు.