Heroine | సినిమా ఇండస్ట్రీలో ఒక్కోసారి కొంతమంది హీరోయిన్స్ కాలక్రమంలో గుర్తు పట్టకుండా మారిపోతారు. ముఖ్యంగా పెళ్లి తర్వాత వారిని గుర్తుపట్టడం చాలా కష్టం అవుతుంది. తాజాగా వైరల్ అవుతున్న ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్ను గుర్తుపట్టారా? ఒకప్పుడు కుర్రకారుకు డ్రీమ్ గర్ల్‌గా పేరొందిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు పూర్తిగా మారిపోయి అభిమానులను షాక్‌కు గురిచేస్తోంది. అందానికి కేరాఫ్ అడ్రస్‌గా ఉండే ఆమె, ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోవడంతో అందరు నోరెళ్లపెడుతున్నారు. ఫొటోలో కనిపిస్తున్న ఈ ముద్దుగుమ్మ పేరు మాళవిక.. అసలు పేరు శ్వేతా కూనూర్. సినీ రంగంలోకి అడుగుపెట్టిన తర్వాతే మాళవికగా పేరును మార్చుకుంది. తెలుగు సినీ ప్రేక్షకులకు ఆమెను పరిచయం చేసిన చిత్రం ‘చాలా బాగుంది’ కాగా ఇందులో ఆమె హీరో శ్రీకాంత్ సరసన హీరోయిన్గా నటించింది.
ఈ చిత్రంతోనే తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన మాళవిక, ఆ తర్వాత దీవించండి, శుభకార్యం, నవ్వుతూ బ్రతకాలిరా, ప్రియా నేస్తమా, అప్పారావు డ్రైవింగ్ స్కూల్ వంటి చిత్రాలలో నటించింది. తెలుగు మాత్రమే కాదు, తమిళ్, కన్నడ భాషల్లోనూ సినిమాలు చేసి మెప్పించింది. 2009 తర్వాత మాళవిక సినిమాలకు దూరంగా ఉండిపోయింది. అయితే తమిళ్ ఇండస్ట్రీలో చాలామంది స్టార్ హీరోలతో నటించిందీ బ్యూటీ. ప్రస్తుతం సినిమాల పరంగా పెద్దగా సందడి చేయకపోయిన, సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటుంది. తరచూ తన ఫోటోలు, వ్యక్తిగత అప్డేట్స్ షేర్ చేస్తూ అభిమానులతో టచ్‌లో ఉంటుంది.
తాజాగా ఆమె షేర్ చేసిన కొన్ని ఫోటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ఒకప్పుడు వెండితెరపై గ్లామర్‌తో అలరించిన మాళవికని, ఇలా చూసిన అభిమానులు గుర్తు పట్టలేకపోతున్నారు. సన్నజాజిలా ఉండే ఈ అమ్మడు ఇంత భారీ పర్సనాలిటీతో అందవిహీనంగా మారిందేంటని కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మాళవిక కెరీర్ తొలినాళ్లలో చాలా పద్దతిగా కనిపించి సందడి చేసేది. కాని ఇప్పుడు సోషల్ మీడియాలో అందాల ఆరబోతతో తెగ రచ్చ చేస్తూ అందరు నోరెళ్లపెట్టేలా చేస్తుంది.