Bedurulanka 2012 | ఒక్క సూపర్‌హిట్ ఇవ్వండి
కార్తికేయ గుమ్మకొండ, నేహా శెట్టి జంటగా నటించిన సినిమా ‘బెదురులంక 2012’. సి. యువరాజ్ సమర్పణలో ఈ చిత్రాన్ని లౌక్య ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మిస్తున్నారు.
కార్తికేయ గుమ్మకొండ, నేహా శెట్టి జంటగా నటించిన సినిమా ‘బెదురులంక 2012’. సి. యువరాజ్ సమర్పణలో ఈ చిత్రాన్ని లౌక్య ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మిస్తున్నారు. క్లాక్స్ దర్శకత్వం వహిస్తున్నారు. ఓ పల్లెటూరిలో 2012 యుగాంతం నేపథ్యంలో ఈ సినిమా సాగనుంది. త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నది. తాజాగా చిత్ర టీజర్‌ను హీరో విజయ్ దేవరకొండ విడుదల చేశారు. దర్శకుడు క్లాక్స్ మాట్లాడుతూ…‘ఎన్నిసార్లు సినిమా చూసినా నవ్వుతూనే ఉన్నాను. ఓటీటీల్లో వైవిధ్యమైన కథల్ని ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఆ నమ్మకంతోనే ఒక కొత్త తరహా చిత్రాన్ని తెరకెక్కించాం’ అన్నారు. నాయిక నేహా శెట్టి మాట్లాడుతూ…‘ నా గత చిత్రం ‘డీజే టిల్లు’లో రాధిక పాత్రలో నన్ను ఆదరించారు.
ఈ సినిమాలో చిత్ర క్యారెక్టర్లోనూ మెప్పిస్తాననే నమ్మకం ఉంది’ అని చెప్పింది. హీరో కార్తికేయ మాట్లాడుతూ…‘ఇటీవల నా సినిమాలు ఆశించిన ఆదరణ పొందలేదు. ఎలాంటి స్క్రిప్ట్ అయితే తిరిగి నాకు పేరొస్తుందో అలాంటి కథ ఇది. ఇలాంటి స్క్రిప్ట్ కోసం చాలారోజులుగా ఎదురుచూశాను. ఎలాంటి సినిమాలను ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లి చూస్తున్నారు అనేది పరిశీలించాను. గతంలో నా సినిమాలకు జరిగిన తప్పులు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నాను. ఎవరి ఇమేజ్ కోసం ఏ సన్నివేశం ఉండదు. ఒక్క ఘన విజయాన్ని ఇవ్వండని కోరుకుంటున్నా’ అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health tips | మంచినీళ్లు తక్కువ తాగితేనే కాదు.. మరీ ఎక్కువ తాగినా ఆరోగ్యానికి హానికరమే..!
Nepal PM Balen Shah | భారత్ చేరుకున్న నేపాల్ ప్రధాని.. సోమవారం ప్రధాని మోదీతో చర్చలు
Festivals | పండుగల సమయంలో స్వీట్లను ఎక్కువగా తింటే షుగర్ లెవల్స్ ఎప్పటికీ అలాగే ఉంటాయా..?
JEE Main | ఈ రాత్రి 12 గంటలకు ముగియనున్న గడువు.. ఇప్పటికే 13 లక్షలు దాటిన జేఈఈ దరఖాస్తులు..!
Health tips | మీలో ఈ లక్షణాలుంటే ఆలస్యం చేయకుండా థైరాయిడ్ పరీక్షలు చేయించుకోండి..!
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

