అగ్ర హీరో రామ్చరణ్-ఉపాసన దంపతులకు ఇటీవలే పాప పుట్టిన విషయం తెలిసిందే. ఈ నెల 20న ఉపాసన పండంటి పాపాయికి జన్మ నిచ్చింది. ఈ చిన్నారికి ‘క్లీంకార కొణిదెల’ అని పేరు పెట్టినట్లు అగ్ర నటుడు చిరంజీవి ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ట్విట్టర్లో ఓ ఫోటోను షేర్ చేశారు.
‘లలిత సహస్ర నామం నుంచి ఈ పేరును తీసుకున్నాం. క్లీంకార అంటే ఆధ్మాతిక చైతన్యానికి, ప్రకృతి స్వరూపానికి, పవిత్రమైన శక్తికి ప్రతీక. జీవితంలో ఎదిగే కొద్ది ఈ లక్షణాలన్నింటిని మా యువరాణి తన వ్యక్తిత్వంలో కనబరుస్తుందని కోరుకుంటున్నా’ అని చిరంజీవి ట్విట్టర్లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్మీడియాలో వైరల్గా మారింది. చక్కటి ఆధ్యాత్మిక, దైవిక భావాలు స్ఫురించేలా పేరు పెట్టారని మెగాభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.