ప్రస్తుతం తన కెరీర్లోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్‌లో నటిస్తున్నారు హీరో రామ్. ఈ చిత్రాన్ని దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా జీ స్టూడియోస్, పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. శ్రీలీల నాయికగా నటిస్తున్నది. రామ్ పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 15న ఈ సినిమా నుంచి ఫస్ట్ థండర్‌ను విడుదల చేయబోతున్నారు. తాజాగా హీరో కొత్త లుక్‌ను రిలీజ్ చేశారు. మాస్, యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాను దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 20న దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : సంతోష్ డికాటే, సంగీతం : ఎస్.తమన్.