“గోల్కొండ హైస్కూల్’ చిత్రంలో సంతోష్‌శోభన్ నటన చూసి ఎంతో ఇంప్రెస్ అయ్యా. మేమిద్దరం దర్శకుడు ఇంద్రగంటి స్కూల్ నుంచే వచ్చాం. సంతోష్ వరుసగా సినిమాలు చేయడం ఆనందంగా ఉంది. ఆయనకు మంచి విజయాలు దక్కాలని కోరుకుంటున్నా’ అన్నారు నాని. శనివారం హైదరాబాద్‌లో జరిగిన ‘లైక్ షేర్ సబ్‌స్ర్కైబ్’ చిత్ర ప్రీరిలీజ్ వేడుకకు నాని ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సంతోష్‌శోభన్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన ఈ చిత్రానికి మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించారు. వెంకట్ బోయనపల్లి నిర్మాత. నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా సంతోష్‌శోభన్ మాట్లాడుతూ ‘ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నాకు మొదట సలహా ఇచ్చింది నానిగారు. ‘నీలో నన్ను చూసుకున్నాను’ అని అన్నారు. ఇప్పటివరకు నేను అందుకున్న బెస్ట్ కాంప్లిమెంట్ అదే. నానిగారి నుంచి చాలా నేర్చుకున్నా. ఆయనలాగే సంభాషణలు ప్రాక్టీస్ చేస్తుంటా’ అని చెప్పారు. తన కెరీర్లో ఇదొక ప్రత్యేకమైన చిత్రమని, దర్శకుడు మేర్లపాక గాంధీ కామెడీ టైమింగ్ ప్రతి ఒక్కరికి నచ్చుతుందని కథానాయిక ఫరియా అబ్దుల్లా చెప్పింది. ఆద్యంతం వినోదం, సస్పెన్స్‌తో ఆకట్టుకునే చిత్రమిదని దర్శకుడు తెలిపారు. తమ బ్యానర్లో మంచి సినిమాగా నిలిచిపోతుందనే నమ్మకం ఉందని నిర్మాత వెంకట్ బోయనపల్లి పేర్కొన్నారు.