Nandamuri Balakrishna: టాలీవుడ్ సమస్యను పట్టించుకునే నాథుడే లేరు.. సినిమా టికెట్ల వివాదంపై బాలయ్య కామెంట్స్
Nandamuri Balakrishna: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా టికెట్ల వివాదంపై సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా టికెట్ల విషయంలో ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా టికెట్ల వివాదంపై సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా టికెట్ల విషయంలో ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు గుప్పించారు. నేడు టాలీవుడ్ సమస్యలను పట్టించుకునే నాథుడే లేకుండాపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ఏపీలో సినిమా టికెట్ల వ్యవహారంపై తెలుగు సినిమా ఇండస్ట్రీ అంతా కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు.
తెలుగు రాష్ట్రాల్లోని రెండు ప్రభుత్వాలు సినిమా రంగానికి సహకరించాలని బాలకృష్ణ కోరారు. సినిమా టికెట్ల ధరలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తాను కట్టుబడి ఉంటానన్నారు. అయితే ఏపీ ప్రభుత్వం చెబుతున్నట్టు చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడాలేమీ ఉండవన్నారు. పెద్ద హీరో సినిమా ఫ్లాపయితే చిన్న సినిమా అంటారని, చిన్న హీరో సినిమా హిట్టయితే పెద్ద సినిమా అంటారని బాలయ్య చెప్పారు.
ఇక ఏపీలో సినిమా టికెట్ల వ్యవహారం త్వరలోనే కొలిక్కి వస్తుందని బాలయ్య ఆశాభావం వ్యక్తంచేశారు. ఎవరో ఒకరు ముందుకొచ్చి పరిశ్రమ సమస్యలను ప్రభుత్వానికి చెప్పాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. తెలుగు సినిమా మూడు పువ్వులు, ఆరు కాయలుగా వర్ధిల్లాలని ఆకాంక్షించారు. సినిమా ఇండస్ట్రీపై లక్షల మంది ఆధారపడ్డారని, వారందరికీ ఉపాధి లభించేలా ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు సహకరించాలని కోరారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వీరన్న సన్నిధిలో సాంస్కృతిక ధర్మ యుద్ధానికి శ్రీకారం : చుంచు రామకృష్ణ
Ayesha Khan | ఎర్ర చీరలో కట్టిపడేస్తున్న ఆయేషా ఖాన్.. అందమైన ఫొటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
Chandrababu | చంద్రబాబుకు చేసిన పనులు చెప్పి ఓట్లు అడిగే దమ్ముందా? : ఎంపీ అవినాష్ రెడ్డి
MP Manoj Tiwari: యమునా నదిలో ఈత కొట్టి.. నీళ్లు తాగిన ఢిల్లీ ఎంపీ.. వీడియో
Sunny Deol | 68 ఏళ్ల వయసులో ఓటీటీ ఎంట్రీ … యాక్షన్ లేకుండా సినిమా చేయడంపై మొదట భయపడ్డ స్టార్ హీరో!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

