Nandamuri Balakrishna | అన్‌స్టాపబుల్ షోలో నర్సులను కించపరిచేలా తాను వ్యాఖ్యలు చేశానంటూ వస్తున్న వార్తలపై బాలకృష్ణ స్పందించాడు. తనపై వస్తున్న ఆరోపణలను ఖండిస్తున్నాని, తన మాటలను కావాలనే వక్రీకరించారని బాలయ్య తెలిపాడు. నర్సుల సేవలను ప్రత్యక్షంగా చూశానని, వాళ్లకు ఎన్నిసార్లు కృతజ్ఞతలు తెలిపినా తక్కువేనని అన్నాడు. తన మాటలు ఏమైనా వారి మనోభావాలను దెబ్బతీస్తే పశ్చాత్తాపడుతున్నానని వెల్లడించాడు.
ఇటీవలే పవన్ ఎపిసోడ్లో బాలయ్య తనకు జరిగిన యాక్సిడెంట్ గురించి పవన్‌కు వివరిస్తూ తనకు వైద్యం చేసిన నర్సును ఉద్దేశించి.. ఆ నర్సు భలే అందంగా ఉందంటూ వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యలపై ఏపీ నర్సింగ్ సంక్షేమ సంఘం అభ్యంతరం వ్యక్తం చేసింది. బాలకృష్ణ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, నర్సులకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. క్షమాపణ చెప్పకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.