‘క’ సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నారు కిరణ్ అబ్బవరం. ఆ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో కొత్త సినిమాను అనౌన్స్ చేయబోతున్నారాయన. విశ్వకరుణ్ ఈ సినిమా ద్వారా దర్శకునిగా పరిచయం కానున్నారు. ‘కెఎ 10’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శివమ్ సెల్యులాయిడ్ ప్రొడక్షన్స్, ఏ యూడ్లీ ఫిల్మ్స్ కలిసి నిర్మిస్తున్నాయి. ఈ నెల 19న ఈ సినిమా టైటిల్‌ను ప్రకటించనున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ సినిమా కిరణ్ అబ్బవరం కెరీర్లో మరో మైలురాయిలా నిలుస్తుందని, భారీ వ్యయంతో ఈ సినిమా నిర్మిస్తున్నామని, ఇందులో నటించే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలియజేస్తామని మేకర్స్ చెప్పారు.